పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

Update: 2020-11-07 05:15 GMT
తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఈ మధ్య బాగా జరుగుతోంది. ఆమెకు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఆమె నివాసానికి వెళ్లి మరీ కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉండటం.. దుబ్బాకలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా అక్కడ ప్రచారానికి రాకపోవడంతో విజయశాంతి పార్టీ మార్పు ఖాయమని అంతా అనుకున్నారు.

నవంబర్ 10న ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. తమకు పూర్తి నమ్మకం ఉందని.. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలోకి విజయశాంతి వెళ్లదని అన్నారు. ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడానని తెలిపారు.

ఈ క్రమంలోనే మధుయాష్కీ వ్యాఖ్యలపై స్వయంగా విజయశాంతి స్పందించడం విశేషం. ‘రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు న్యూస్ చానెల్స్ లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీ గారికి నా ధన్యవాదాలు’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో విజయశాంతి కాంగ్రెస్ లోని కొందరి తీరుపై గుర్రుగా ఉన్నారని అర్థమవుతోంది. అదే సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో అడుగులు ఎటు వైపు పడుతాయో చూడాలి.
Tags:    

Similar News