అన్ని రోజులు ఒకలా ఉండవు. కొన్ని సందర్భాల్లో నోరు ఎత్తటానికి అవకాశం ఉండదు. కానీ.. అలాంటి రోజులు ఎక్కువ ఉండవు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం కూడా ఇలానే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి యాభై రోజులు దాటిన తర్వాత కూడా ఒక్క మంత్రితో నెట్టుకురావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయటానికి సైతం ఎవరికి దమ్ము.. ధైర్యం సరిపోని పరిస్థితి. దీంతో.. ఎవరూ నోరు విప్పటానికి సాహించటం లేదు. ప్రభుత్వం కొలువు తీరి ఒకటిన్నర నెల దాటిన తర్వాత కూడా అసలేం జరగకుండా ఉండటంపై ఇప్పుడిప్పుడే అసంతృప్తి స్టార్ట్ అవుతోంది. మొన్నటి వరకూ కేసీఆర్ పై మాట్లాడటానికి వెనుకాడుతున్న వారు.. ఇప్పుడు నోరు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా షురూ చేసినోళ్లలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ మొదటి ముగ్గురిలో ఉన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన న్యూమాయిష్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం..మంటల్ని ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఫైరింజన్లలో నీళ్లు లేకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టిన ఆమె.. రాష్ట్రంలో మంత్రులు లేని ప్రభుత్వం.. నీళ్లు లేని ఫైరింజన్లు అంటూ ఆమె మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలకు విలువ తెలియని పాలన ప్రజాపాలన ఎలా అవుతుందంటూ ఆమె ప్రశ్నించారు. ఇవాల్టి రోజున తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందన్న ఆమె.. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా.. రాజకీయ కారణాలతో మంత్రులను నిర్ణయించకపోవటం విడ్డూరమన్నారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్న ప్రశ్నను సంధించిన ఆమె.. తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకోలేదన్నారు. న్యూమాయిష్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కేసీఆర్ పై నిప్పులు చెరిగేందుకు విపక్షాలకు ఒక ఆయుధంగా దొరికిందని చెబుతున్నారు.