తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు - అన్నాడీఎంకే సీనియర్ నేత శశికళను సినీనటి విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ కు వెళ్లిన ఆమె శశికళతో సమావేశమయ్యారు. అంతకుముందుకు విజయశాంతి మెరీనాబీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరని లోటని పేర్కొన్నారు.
విజయశాంతి మొదట బీజేపీ నాయకురాలిగా ఉండి అనంతరం టీఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అడపాదడపా మీడియాలో కనిపించడం మినహా పార్టీ కార్యక్రమాలకు సైతం పెద్దగా హాజరవడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నమ్మతో విజయశాంతి భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వెనుక రాజకీయ కారణాలు ఉండి ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/