రాజకీయాల్లో క్షణానికో తీరులో పరిణామాలు మారుతూ ఉంటాయి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాకపోయినా వాళ్లు చెప్పే మాటలు మాత్రం కొన్ని సార్లు శాశ్వతత్వం పొందే ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా బాగా విస్తృతంలోకి వచ్చింది కనుక ఇంకా అవి కొన్నాళ్ల పాటు నిక్షిప్తం అయి ఉంటాయి. అందుకే ఆ రోజు పదవి వద్దనుకున్నా, ఇవాళ పదవి లేకపోయినా విజయనగరం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు అంటే ఎందరికో అమిత గౌరవం.
ఆ పాటి గౌరవం వైసీపీ నాయకులకు లేని కారణంగానే వాళ్లు తరుచూ ప్రజల దగ్గర పరువు పోగొట్టుకుంటున్నారని టీడీపీ ఎప్పటికప్పుడు చెప్పే మాట ! తమ నాయకుడి గుణం ఆదర్శం అని అంటుంటారు. అందుకే ఆయన ఏం మాట్లాడినా కాస్తయినా నిజాలకు దగ్గరగా ఉంటాయి. మరీ! చెల్లని మాటలు చెప్పరు. చెప్పనివ్వరు కూడా ! కేంద్రంతో ఆ రోజు తెగదెంపులు చేసుకోవడానికి ముఖ్య కారణం కూడా రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయకపోవడమే అని మరో మారు చెప్పడం ఇప్పుడు మరింత చర్చకు తావిస్తోంది. టీడీపీ, బీజేపీ దగ్గరవుతున్న వేళ ఆయన మాటలు మరింత విస్తృతం పొంది ఉన్నాయి. విస్తృతార్థంలో తీసుకుంటే ఆ రెండు పార్టీల బంధం చెడిపోవడానికి కారణంగా రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సాయం కేంద్రం నుంచి దక్కకపోవడమే ! మరి! ఇప్పుడు మళ్లీ చేరువ అయితే ఏమౌతుంది?
రాజకీయం అనగా వంద అనాలి..వందకు వంద వినాలి. అటుపై మరో వెయ్యి పడాలి.. ఇవన్నీ లక్షణంగా రాజకీయం చేయాలనుకున్న వారికి పడవు. లక్ష మాటలు పడి కోటి దెబ్బలు తినిపించుకోవడం అన్నది మంచి పని కాదు. కాస్త విలువల్లో ఉండాలి. విలువ తెలిసి ఉండాలి. లెక్కలేని తనం మంచిదే కానీ అన్ని వేళలా కాదు. ఎవ్వరిని అయినా గుర్తించి గౌరవించాలి. ఇవి మాత్రమే తెలిస్తే మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు (విజయనగరం రాజు అని రాయాలి) మాత్రమే పరిచయం అవుతారు.
ఆ రాజు, ఆ వైభోగం రెండూ కూడా అర్థం అవుతాయి. కానీ మన రాజకీయాల్లో విలువలు వెతుక్కుంటే అశోక్ కనిపించరు. వయసుకు విలువ ఇవ్వాలి అని కూడా తెలియకపోతే అశోక్ అసలు కంటికి కనిపించనైనా కనిపించరు. వెల్లంపల్లి లాంటి జూనియర్లు విజయనగరం వచ్చి రామతీర్థాల గుడి దగ్గర రెచ్చిపోయిన దాఖలాలు మరిచిపోగలమా..? కనుక ఎదురుగా ఉన్నా కూడా ఆయన స్థాయి ఎంత గొప్పది లేదా ఉన్నతమైంది అయినా కూడా ఆయన కనిపించరు. ఆ విధంగా ఆయన పొడ కొందరికి గిట్టదు కూడా !
పార్లమెంట్ లో ఆ రోజు అశోక్ పెద్దగా సాధించిందేమీ లేదు. అసలు ఆయనకు ఆ రోజు ఆ పదవి ఇష్టం లేదు. పౌర విమానాయన శాఖను నిర్వహించి నేనేం చేస్తాను అని ఆ రోజు కేంద్ర మంత్రి హోదాలో చెప్పలేదు కానీ మన భోగాపురానికి మాత్రం ఏమీ చేయలేకపోయారు.అంతేకాదు ఆ రోజు భూసేకరణ తప్ప మిగిలిన పనులు ఏవీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి చేయలేకపోయారు కూడా ! తరువాత పనులు కూడా ఆగిపోయాయి.
అందుకేనేమో ఇన్నాళ్లకు ఆ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కనుకనే పదవి విడిచి వచ్చానని అంటున్నారాయన. ఇన్నాళ్లు ఆయన చెప్పి మాట మరో సారి కూడా రుజువు కానుంది. ఇప్పుడు కూడా వైసీపీ సర్కారుకి అంతే స్థాయిలో సాయం చేయని గుణం ఒకటి బీజేపీ చాటుకుంటోంది. అయినా కూడా మన రాష్ట్ర ఎంపీలు పదవులకు రాజీనామా చేసి రాలేరు. బీజేపీ వద్దన్నా మేం వెనుకే అని మాత్రం అంటారు. మంచో చెడో ఆ రోజు అశోక్ గజపతి రాజు మాత్రం పార్టీ అధినేత మాట ప్రకారం పదవిని తృణప్రాయంగా వదిలి ఉన్నత గుణం ఒకటి చాటుకున్నారు. ఇప్పుడు పదవులు లేకున్నా కూడా సాయి రెడ్డి లాంటి వారు బీజేపీ తో ప్రతిరోజూ తిరుగాడుతూ రాష్ట్రానికి ఏమీ సాధించలేని స్థితిలో ఉండిపోతున్నారు అన్న విమర్శ ఒకటి అందుకుంటున్నారు.