ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది. ఆగండాగండి.. ఇదేమీ కేంద్ర రాష్ట్ర మధ్య నిధుల వ్యవహారానికి సంబంధించిన సమస్యగానీ, పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సంబంధించిన సమస్య గానీ కాదు. అచ్చంగా ఇది వారి పార్టీలో పుట్టిన ముసలమే. బెజవాడ నగర కార్పొరేషన్ మేయర్ పదవి.. ఎవరికి దక్కాలి - ఆ హోదాను ఎవరు ఎంతకాలం అనుభవించాలి... అనే విషయంలో.. రేగిన రగడ.. ఇప్పుడు పార్టీలో కుమ్ములాటలను రోడ్డున పెడుతోంది. పైగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇదొక ఆచారంగా మారితే.. ముందుముందు అనేక రకాల అనూహ్యమైన ఇబ్బందులు తలెత్తినా కూడా ఆశ్చర్యం లేదనే భయాన్ని కూడా కలిగిస్తున్నది.
వివరాల్లోకి వెళితే.. బెజవాడ మేయర్ గా ప్రస్తుతం కోనేరు శ్రీధర్ ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన కార్పొరేటర్లలోనే ఆయన పట్ల విపరీతమైన అసంతృప్తి ఉంది. ఆయనను తక్షణం గద్దెదించి వేరే సామాజిక వర్గాలకు పదవిని కట్టబెట్టాలని ఒక డిమాండ్ చాలా కాలం నుంచి సాగుతోంది. ప్రస్తుతం అది ముదిరి ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ - ఎంపీల వద్దకు విడివిడిగా పంచాయతీల దాకా వెళ్తున్నది. కోనేరు శ్రీధర్ వ్యవహార సరళితో విసిగిపోయిన చాలా మంది కార్పొరేటర్లు ఆయనను తక్షణం తప్పించాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అసంతృప్తి వాదుల వెనుక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారనేది ఒక ప్రచారం. అయితే ఇప్పుడు వారంతా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న , - ఎంపీ కేశినేని నాని లను కలిసి పితూరీలు చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. వారి డిమాండ్ మరో ఎత్తు. నగర మేయర్ పదవిని కులాల వారీగా రొటేషన్ పద్ధతిపై అప్పగించాలనేది వారి తాజా కోరిక. పార్టీల మధ్య పొత్తులు ఉంటే.. పార్టీలు రొటేషన్ పద్ధతిలో పదవిని పంచుకోవడం సహజం గానీ.. కులాల వారీగా పదవిని పంచుకోవడం అనేది కొత్త పరిణామం. బెజవాడలో ఉన్న ఒత్తిడి వల్ల దీనికి తలొగ్గితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇతర మునిసిపాలిటీలు - కార్పొరేషన్ల నుంచి ఇలాంటి డిమాండ్లు వినిపించవచ్చునని పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. ఒకసారి ఇలాంటి డిమాండ్లను అనుమతించడం ప్రారంభిస్తే.. కులాల రొటేషన్ అనేది.. మునిసిపాలిటీల మేయర్ లు - చైర్మన్ ల పరిధిని దాటి ఎంతవరకైనా రావచ్చునని.. ఈ పోకడకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా పార్టీలో కొందరు భావిస్తున్నట్లు సమాచారం. ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని.. మేయర్ ను మార్చినా కూడా.. కులాల రొటేషన్ అనే డిమాండ్ ప్రకారం కాకుండా మరో కారణాలు చూపించి.. జరగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకటి కాకుంటే ఒకటి టీడీపీకి చికాకులు పెరుగుతున్నాయని పలువురు అంటున్నారు.