సంక్రాంతి పండుగ అన్నంతనే కోడి పందేలు పెద్ద ఎత్తున సాగటం తెలిసిందే. దీనిపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. పండుగ పూట ఎవరి పనిలో వారు బిజీగా ఉండటం చూస్తుంటాం. కోడి పందేల్ని అడ్డుకొని అనవసరమైన ఉద్రిక్తలకు తెర తీయకుండా.. ఆ రోజుకు చూసి చూడనట్లుగా వ్యవహరించటం చాలాచోట్ల చూస్తుంటాం. అందుకు భిన్నంగా. అడ్డుకునే ప్రయత్నం చేసి.. గ్రామస్తుల దాడితో గాయాలపాలయ్యారు ఒడిశా పోలీసులు.
మల్కన్ గిరి జిల్లాలోని మారగాన్ పల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందేలు సాగుతున్నాయి.వీటిని అడ్డుకోవటానికి ఉన్నతాధికారితో పాటు ఎనిమిది మంది పోలీసులు మఫ్టీలో ఆ గ్రామానికి వెళ్లారు. పండుగ వేళ.. గ్రామ శివారులోని ఒక తోట వద్ద కొంతమంది గ్రామస్తులు మద్యం తాగి.. కోళ్ల పందేల్ని భారీగా నిర్వహిస్తున్నారు.
దీంతో.. పోలీసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు మఫ్టీలో ఉండటంతో గ్రామస్తులు పొరపడ్డారు. తమ గ్రామానికి సంబంధం లేని వారు కోడి పందేల్ని అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతో ఊగిపోయి.. పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఉదంతంలో వారికి గాయాలయ్యాయి.
దీంతో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్సను అందించారు. పోలీసులపై దాడి గురించిన సమాచారం అందినంతనే కలిమెల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పందేల్ని అడ్డుకున్నోళ్లు పోలీసులని తెలీక దాడి జరిగినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే.. పోలీసులపైనే దాడి జరగటంతో ఇష్యూ సీరియస్ గా ఉండటమే కాదు.. కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.