మాజీ మంత్రి దేవినేని ఉమకు గ్రామస్తులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వచ్చిన రోజు నుండి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపై ఈ మాజీ మంత్రి ఆరోపణలు చేయని రోజులేదు. ఏదో ఓ విషయాన్ని పట్టుకోవటం సంబంధం ఉన్నా లేకపోయినా జగన్ను టార్గెట్ చేసుకుని మీడియా సమావేశాల్లో రెచ్చిపోవటమే పనిగా పెట్టుకున్నారు దేవినేని. దేవినేని టైం టేబుల్ ఏమిటంటే ప్రతిరోజు ఏదో ఓ గ్రామానికి వెళతారు. వెంట కొందరు మద్దతుదారులుంటారు. వీళ్ళతో పాటు మీడియాను కూడా తీసుకెళతారు.
విద్యుత్ సమస్యనో లేకపోతే పంటలు దెబ్బతిన్నాయనో అదీకాకపోతే రోడ్ల నిర్మాణమనో ఇలా ఏదో ఓ అంశంపై ప్రభుత్వంపై మండిపోతారు. దాన్ని మీడియా బాగా హైలైట్ చేస్తుంది. ఇదే పద్దతిలో రోజులాగే మంగళవారం ఉదయం కూడా మద్దతుదారులను, మీడియాను వెంటేసుకుని దేవినేని జక్కంపూడి-షాబాద్ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ళముందు నిలబడి వాటిని చూపిస్తు ప్రభుత్వంపై ఆరోపణలతో రెచ్చిపోవటం మొదలుపెట్టారు.
అయితే కొద్దిసేపటి తర్వాత ఇక్కడ ఏదో జరుగుతోందని గమనించిన గ్రామస్తులు కూడా దేవినేని ఉన్న చోటకు చేరుకున్నారు. మాజీమంత్రి చెబుతున్నది విన్న తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్ళ గురించి దేవినేని ఆరోపణలు చేస్తున్న విషయం వారికి అర్ధమైంది. వెంటనే మాజీమంత్రిని గ్రామస్తులు తగులుకున్నారు. టీడీపీ హయాంలో తమకందరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పి తమ భూములు తీసుకుని తమకివ్వకుండా విజయవాడలో వాళ్ళకు ఇక్కడ భూములు ఎందుకిచ్చారంటూ నిలదీశారు.
తమ ప్రాంతాల్లో మట్టిని, ఇసుకను అక్రమంగా దోచుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించింది మీ మద్దతుదారులే కదా అంటూ మండిపోయారు. అప్పుడు కోట్ల రూపాయలను దోచుకుని ఇఫుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ గట్టిగా మాట్లాడారు. తమ భూములు తీసుకుని పేదలను టీడీపీ హయాంలో అన్యాయం చేశారంటూ గట్టిగా నిలదీశారు. టీడీపీ హయాంలోనే ఇళ్ళను పూర్తి చేస్తే మరి అప్పుడే తమకు ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగా వాదన పెట్టుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు తమ స్ధలాలన్నింటినీ మీ మద్దతుదారులే కబ్జాలు చేశారంటూ దేవినేనిపై విరుచుకుపడ్డారు. దాంతో గ్రామస్తులకు ఏమి సమాధానం చెప్పాలో దేవినేనికి అర్ధంకాలేదు. అసలు తనను గ్రామస్తులు అందరిముందు నిలదీస్తారని ఏమాత్రం ఊహించని దేవినేని వారికి ఏమీ సమాధానం చెప్పలేక అక్కడి నుండి జారుకున్నారు.