విమ‌ల‌క్క ఆఫీసును అలా ఖాళీ చేయించారు

Update: 2017-05-07 04:49 GMT
కోర్టు ఆదేశాల న‌డుమ అరుణోద‌య సంస్కృతిక స‌మాఖ్య కార్యాల‌యాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేసే స‌మ‌యంలో పోలీసులు ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ వ్య‌వ‌హారాన్ని ప‌ర్య‌వేక్షించారు. ఖాళీ చేసిన అనంత‌రం కార్యాల‌య తాళాన్ని ఇంటి య‌జ‌మానికి అంద‌జేశారు. ఇంత‌కీ అరుణోద‌య రాష్ట్ర కార్యాల‌యాన్ని కోర్టు ఆదేశాల్ని ఎందుకు ఖాళీ చేయించాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంలోకి వెళితే..

2009 నుంచి ఒక అద్దె ఇంట్లో విమ‌ల‌క్క అరుణోద‌య సాంస్కృతి స‌మాఖ్య కార్యాల‌యాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యాల‌య య‌జ‌మాని ఆర్ఎస్ శాస్త్రి నుంచి క‌రియ‌మ్మ అనే మ‌హిళ అద్దెకు తీసుకున్నారు. అయితే.. తాను అద్దెకు ఇచ్చిన ఇంట్లో అరుణోద‌య సంస్థ‌ను నిర్వ‌హిస్తున్న విష‌యాన్ని నాలుగునెల‌ల త‌ర్వాత తెలుసుకున్న శాస్త్రి.. ఇంటిని ఖాళీ చేయాలంటూ విన్న‌పాలు చేస్తూనే ఉన‌నారు. ఇదిలా ఉండ‌గా.. 2016 డిసెంబ‌రులో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి రూర‌ల్ పోలీసులు ఒక కేసులో భీంభ‌ర‌త్ అనే వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అత‌నిచ్చిన స‌మాచారంతో అరుణోద‌య సాంస్కృతి స‌మాఖ్య రాష్ట్ర కార్యాల‌యంలో త‌నిఖీలు నిర్వ‌హించారు. సోదాల స‌మ‌యంలో నిషేధిత వ‌స్తువులు ల‌భించిన‌ట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇంటిని ఖాళీ చేయించే విష‌యంపై ఇంటి య‌జ‌మాని శాస్త్రి కోర్టుకు వెళ్లి చేసిన పోరాటానికి ఫ‌లితంగా గ‌త నెల (ఏప్రిల్‌) 25న కార్యాల‌యాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. కోర్టు ఆదేశాల్ని అమ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా నాలుగు గంట‌ల పాటు హైడ్రామా న‌డిచింది. కార్యాల‌యాన్ని ఖాళీ చేసే స‌మ‌యంలో స‌మాఖ్య నాయ‌కులు విమ‌ల‌క్క‌.. మోహ‌న్ బైరాగితో పాటు ప‌లువురు కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల్ని త‌మ‌కు ఇవ్వ‌కుండా ఎలా ఖాళీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఖాళీ చేయ‌టానికి వారం వ్య‌వ‌ధి ఇవ్వాల‌న్నారు. కోర్టు ఆదేశాల్ని అమ‌లు చేస్తున్న‌ట్లుగా పేర్కొని.. ఇంట్లో ఉన్న వ‌స్తువుల్ని అరుణోద‌య స‌మాఖ్య‌కు అప్ప‌గించారు. చివ‌ర‌కు ఇంటి తాళాల్ని.. య‌జ‌మాని శాస్త్రికి అప్ప‌జెప్పారు. ఈ సంద‌ర్భంగా ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News