వైరల్: మర్మాంగ ద్వీపం.. అంగం రూపంలో ఐలాండ్

Update: 2021-02-24 03:30 GMT
ఖాళీగా బుర్ర ఉంటే బోలెడు ఆలోచనలు వస్తాయి. టైంపాస్ గా ఉంటే ఏదేదో వెతికేస్తాం.. అలానే గూగుల్ ఎర్త్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను చూస్తున్న ఓ మహిళకు ఓ సముద్రంలోని ద్వీపం అట్రాక్ట్ చేసింది.

తాజాగా సముద్రం మధ్యలో ఉన్న ఓ ద్వీపాన్ని చూసి నోరెళ్లబెట్టింది. ఎందుకంటే ఆ ద్వీపం 'అంగం' ఆకారంలో ఉంది. అమెరికాలోని మిచిగాన్ కు చెందిన జోలీన్ వల్తాగ్గియో అనే మహిళ ఓ రోజు పసిఫిక్ సముద్రంలో ఓవియాకు సమీపంలో గల త్రినిటీ ఐలాండ్ లను చూస్తుండగా ఓ ద్వీపం తేడాగా కనిపించిందట..జూమ్ చేసి చూడగా.. అచ్చు గుద్దినట్టు ఆ ద్వీపం పురుషాంగం రూపంలో ఉంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ త్రినిటీ ద్వీపంలో 3400 మంది వరకు జీవిస్తున్నారు.

ఈ ఐలాండ్ ను స్క్కీన్ షాట్ తీసి ఫేసుబుక్ లో ఆ మహిళ షేర్ చేసింది. గూగుల్ మ్యాప్ లో ఆ ద్వీపాన్ని పిన్ చేసింది. ఏదో ఒకరోజు ఆ ఐలాండ్ కు వెళుతానని.. ఆ పెద్ద అంగంపై కూర్చుంటాను అని సరదా వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News