టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి... పక్కపక్కనే నిలబడి ఒకే ఫ్రేంలో కనిపిస్తే... ఆ పిక్ వైరల్ పిక్కే కదా. అసలు ఈ తరహా పొటోను మనం ఎప్పుడైనా చూశామా? ఇకపై చూస్తామో, లేదో కూడా తెలియదు. అందుకే మరి... ఈ ఇద్దరు నేతల కలయికను అత్యంత అరుదైన కలయిక గానే చెప్పాలి. అయినా కేసీఆర్, రేవంత్ ల మధ్య కొనసాగిన వైరాన్ని వారిద్దరితో పాటు మనమంతా కూడా ఇప్పుడప్పుడే ఎలా మరిచిపోగం. అందుకే శుక్రవారం వారిద్దరూ కలిసి కనిపించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.
రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బద్ధ శత్రువులుగా కనిపించే కేసీఆర్, రేవంత్ లు ఎక్కడ? ఎలా? ఎప్పుడు కలిశారన్న విషయానికి వస్తే... శుక్రవారం హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్- ఎంజీబీఎస్ ల మధ్య ఏర్పాటైన మార్గాన్ని సీఎం హోదాలో కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో కేసీఆర్ హాజరైతే... స్థానిక ఎంపీగా (మల్కాజిగిరీ ఎంపీ) హోదాలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్. శ్రీనివాస గౌడ్ లు హాజరు కాగా.. లోకల్ ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుంటే... ఆయన పక్కన సికింద్రాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తూము పద్మారావు గౌడ్ నిలుచుంటే... ఆ పక్కనే రేవంత్ రెడ్డి నిలుచున్నారు. అంటే... కేసీఆర్, రేవంత్ ల మధ్యలో పద్మారావు మాత్రమే ఉన్నారు. అంతేకాదండోయ్... కేసీఆర్ కూ, తనకూ మధ్యలో నిలుచున్న పద్మారావు చేతిలో చెయ్యేసి మరీ రేవంత్ కనిపించారు. అంటే... ఒకే ఒరలో ఇమడని కత్తుల మాదిరిగా కనిపించే కేసీఆర్, రేవంత్ రెడ్డి... ఈ సందర్భంగా నవ్వులు చిందిస్తూ కనిపించడం నిజంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.