లేటు వయసులో బ్రిటన్ ప్రధాని ఘాటుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
బ్రిటన్ ప్రధాని జాన్సన్(55) ప్రేమించి తన ప్రియురాలు కారీ సైమోడ్స్(33)నే పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ వేడుకలో పాల్గొనేందుకు చివరి నిమిషంలో అతిథులకు ఆహ్వానాలు పంపారట.. ఈ పెళ్లి విషయంలో ప్రధాని కార్యాలయంలో సీనియర్ అధికారులకు కూడా తెలియనీయలేదని సమాచారం.
పెళ్లిని కేథలిక్ కెథడ్రాల్ చర్చిలో చేశారని.. 33 ఏళ్ల సైమోడ్స్ లిమోజిన్ తెల్లటి గౌను ధరించి అక్కడికి వచ్చారని.. 30 మంది మాత్రమే అతిథులు వచ్చారని టాక్. ఇక బ్రిటన్ ప్రధాని రహస్య పెళ్లిపై ఆయన అధికార ప్రతినిధిని సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.
2019 నుంచే బ్రిటన్ ప్రధాని జాన్సన్ తన ప్రియురాలు సైమోడ్స్ తో కలిసి డౌనింగ్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. 2020లో వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. 2022లో పెళ్లికి సిద్ధమైనా వీరు హాఠాత్తుగా పెళ్లి చేసుకోవడం బ్రిటన్ లో సంచలనమైంది.
55 ఏళ్ల జాన్సన్ కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరితో విడిపోయారు. ఆయన రెండో భార్య మారినా వేలర్ కు నలుగురు సంతానం కావడం విశేషం.