టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్ వచ్చేశాడు. ఐపీఎల్ గేమ్ లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో దిగగానే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెలుగులో మాట్లాడి రోహిత్ అలరించారు.
‘మేము వచ్చేసినమ్.. ఎంఐ ఫ్యాన్స్.. పదండి ఉప్పల్ కు’ అని రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడడం విశేషం. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వందల కొద్దీ కామెంట్లు, షేర్లు వచ్చేశాయి.
నేడు రాత్రి ముంబైతో హైదరాబాద్ ఉప్పల్ లో తలపడబోతోంది. రెండు జట్లు హైదరాబాద్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ లో ఉన్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన టీం మొత్తాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. సచిన్, రోహిత్ సహా ముంబై ఆటగాళ్లు తిలక్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. తొలిసారి హైదరాబాద్ లో మ్యాచ్ ఆడుతుండడంతో తెలుగు కుర్రాడు, ముంబై బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ ఆనందంగా ఉన్నాడు.
ఇప్పటివరకూ ముంబై, హైదరాబాద్ రెండూ జట్లూ తలో రెండు మ్యాచులు గెలిచాయి. రెండు ఓడిపోయాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆరు పాయింట్లతో పట్టికలో ముందుకెళుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాలతో రోహిత్ శర్మకు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్, విశాఖపట్నంలో రోహిత్ కు బంధువులు ఉన్నారు. రోహిత్ అమ్మమ్మ వాళ్లది వైజాగ్ కావడం విశేషం. ఐపీఎల్ లో మొదట హైదరాబాద్ ఫ్రాంచైజీకే రోహిత్ ఆడాడు. ఇక్కడ ఆడటాన్ని సెంటిమెంట్ గా భావిస్తాడు.