కోహ్లీకి మ‌రో అరుదైన ఘ‌న‌త‌!

Update: 2018-07-25 12:24 GMT
కొప్పున్నమ్మ ఏ జ‌డ వేసినా అంద‌మే అన్న చందంగా....బాగా పాపులారిటీ ఉన్న సెల‌బ్రిటీలు ఏంచేసినా డ‌బ్బులు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిప‌డుతుంటాయి. స‌ర‌దాగా సోష‌ల్ మీడియాలో త‌మ ఫొటోలు షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన ఇన్ స్టాగ్రామ్ ఖాతా కూడా కొంత‌మంది సెల‌బ్రిటీల‌కు కాసులు కురిపిస్తోంది. ఆ సెల‌బ్రిటీలు త‌మ‌ అకౌంట్ లో ఒక యాడ్ పోస్ట్ చేసినందుకు....కోట్ల రూపాయ‌లు చెల్లించేందుకు ఎమ్ ఎన్ సీలు ముందుకు వ‌స్తున్నాయి. ఈ త‌ర‌హాలో ఇన్ స్టాగ్రామ్ లో ప్ర‌క‌ట‌నల ప‌రంగా రిచెస్ట్ సెల‌బ్రిటీని....హాప‌ర్ హెచ్ క్యూ సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టిస్తుంది. అదే త‌ర‌హాలో ఈ ఏడాది విడుద‌ల చేసిన జాబితాలో అమెరిక‌న్ మోడ‌ల్ కైలీ జెన్న‌ర్ అగ్ర‌స్థానంలో నిలిచింది. త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక యాడ్ పోస్ట్ చేసినందుకు గానూ కైలీ....దాదాపుగా 7 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేస్తోంది. ఇక‌, ఓవ‌రాల్ గా ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 17వ‌స్థానం ద‌క్కించుకోగా....అథ్లెట్లలో 9వ స్థానంలో నిలిచాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ....క్రికెట్ లో ఎన్నో రికార్డులను సాధించాడు. అదే త‌ర‌హాలో త‌న బ్రాండ్ వ్యాల్యూను ప్ర‌తి ఏటా పెంచుకుంటూ పోతున్నాడు. ప్ర‌తి ఏటా సంప‌న్న క్రీడాకారుల జాబితాలో కోహ్లీ ఎగ‌బాకుతూనే ఉన్నాడు. తాజాగా, సోష‌ల్ మీడియాలోనూ త‌న హ‌వా సాగిస్తున్నాడు. కోహ్లీకి ఇన్‌ స్టాగ్రామ్‌ లో 2.3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. త‌న ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో స్పాన్సర్డ్ పోస్ట్ లు చేసినందుకు గాను కోహ్లీ భారీ మొత్తాన్ని వ‌సూలు చేస్తున్నాడు. ఒక యాడ్ పోస్ట్ చేసినందుకుగానూ కోహ్లీ దాదాపు 80ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు. ఓవ‌రాల్ జాబితాలో కోహ్లీ 17వ స్థానంలో ఉండ‌గా....అథ్లెట్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్-10లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీ కావ‌డం విశేషం. బాస్కెట్ బాల్ సూపర్‌ స్టార్ స్టీఫెన్ కర్రీ - ప్రొఫెషనల్ బాక్సర్ ప్లాయిడ్ మేవెద‌ర్ వంటి వారిని కూడా కోహ్లీ వెనక్కి నెట్ట‌డం విశేషం. పోర్చుగల్ పుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అథ్లెట్ల‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ సెల‌బ్రిటీల‌కున్న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ - పోస్ట్ ల సంఖ్య‌ - స‌గ‌టున ఎంత‌మంది రెగ్యుల‌ర్ గా ఫాలో అవుతున్నారు అన్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ జాబితాను హాప‌ర్ హెచ్ క్యూ రూపొందిస్తోంది.
Tags:    

Similar News