పోయినేడాది ఐపీఎల్ చూసినవాళ్లెవ్వరూ కూడా విరాట్ కోహ్లి ప్రభంజనాన్ని అంత సులువుగా మరిచిపోలేరు. టీ20ల్లో ఒక సెంచరీ చేయడమే అరుదైన విషయం అంటే.. అతను ఒక ఐపీఎల్ సీజన్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. దాదాపు వెయ్యి పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఆ సీజన్లో అతడి ఆట చూస్తే ఇతను అసలు మానవమాత్రుడేనా అన్న సందేహం కలిగింది అందరికీ. ఆ ఐపీఎల్‌కు ముందు.. తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోనూ విరాట్ పరుగుల ప్రవాహం అదే స్థాయిలో సాగింది. కానీ ఇటీవలి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మూడు టెస్టుల్లో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. పైగా గాయంతో చివరి టెస్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఐపీఎల్ లోనూ తొలి మూడు మ్యాచ్ లు ఆడలేకపోయాడు.
అతడు లేని బెంగళూరు మూడు మ్యాచుల్లో రెండు ఓడింది. ఒక మ్యాచ్ లో చచ్చీచెడి గెలిచింది. గత మ్యాచ్ కు డివిలియర్స్ వచ్చినా ఫలితం లేకపోయింది. విరాట్ లేకపోవడం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ఐతే ఇప్పుడు కోహ్లి కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్ నెస్ సాధించేశాడు. అతను శుక్రవారమే బరిలోకి దిగుతున్నాడు. ఈ రోజు సాయంత్రం ముంబయి ఇండియన్స్ ను సొంతగడ్డపై ఢీకొనబోతోంది బెంగళూరు. విరాట్ పునరాగమనంపై అప్పుడే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మార్క్ యువర్ డేట్.. మార్క్ యువర్ టైమ్.. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు సోషల్ మీడియాలో. మామూలుగానే బెంగళూరులో మ్యాచ్ అంటే కోలాహలంగా ఉంటుంది. పైగా విరాట్ రీఎంట్రీతో సందడి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా ఐపీఎల్ లో అత్యధిక హైప్ తెచ్చుకున్న మ్యాచ్ ఇదే కాబోతోంది. మరి రీఎంట్రీలో విరాట్ తనదైన ముద్ర వేస్తాడా.. ఫామ్ అందుకుంటాడా.. బెంగళూరును గెలుపు బాట పట్టిస్తాడా.. చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/