యూనివర్సిటీలో కాల్పులు ...క్యాంప‌స్ క్లోజ్‌

Update: 2017-10-15 08:29 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోమారు కాల్పుల క‌ల‌కలం చోటుచేసుకుంది. ఇటీవ‌ల లాస్ వెగాస్‌లో సంగీత విభావ‌రిలో జ‌రిగిన భారీ కాల్పుల నుంచి ఇప్పుడిప్పుడే  కుదుట‌ప‌డుతున్న‌ అమెరికాలో మ‌రోమారు అలాంటి ప‌రిణామ‌మే అందులోనూ విద్యాల‌యంలో జ‌రిగింది. యునైటెడ్ స్టేట్స్‌లోని వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డట్లుగా ప్రాథమిక సమాచారం. దీనిపై పూర్తి వివ‌రాల కోసం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో శ‌నివారం రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు వర్సిటీ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఉదంతం త‌మ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కాల్పుల ఘటనతో వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను మూసివేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.యూనివర్శిటీ వైపు ఎవరూ రావొద్దని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేపట్టామ‌ని పోలీసులు తెలిపారు. కాగా కాల్పులు ఎవరూ, ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. తాత్కాలికంగా వర్సిటీ మూసివేసినా… ఈ ఘటనతో వర్సిటీకి ఎలాంటి ముప్పులేదని అధికారులు పేర్కొన్నారు .
Tags:    

Similar News