తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాలు..

Update: 2020-07-09 07:30 GMT
తెలుగు రాష్ట్రాలను కరోనా కప్పేస్తోంది. వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఏపీలో ఇప్పటికే అన్ని కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చి ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది. తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఆలయంలో 80మందికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బుధవారం 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 12మంది మృతి చెందడం కలకలం రేపింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22259కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 264కు చేరింది.

ఇక తెలంగానలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజుకు 1500పైనే కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 1924 పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30వేలకు చేరింది. బుధవారం ఒక్కరోజే 11 మంది కరోనాతో మృతిచెందడం కలకలం రేపింది. మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు 324మంది కరోనాతో చనిపోయారు. జీహెచ్ఎంసీలోనే కేసుల తీవ్రత అధికంగా ఉంది.

కరోనా కేసులు పెరుగుతుండడం.. మరణాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు తగ్గుతూ మరణాల సంఖ్య పెరగడం మంచి పరిణామం కాదు.. దీనివల్ల ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది. కరోనా తీరు వేగంగా మారుతూ మరణాల రేటు పెరగడమే ఇప్పుడు అందరిలోనూ భయాన్ని కలిగిస్తోంది. మొన్నటివరకు లేని ఈ మరణాల రేటు సడన్ గా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండడం గమనార్హం.
Tags:    

Similar News