తస్మాత్ జాగ్రత్త.. వారి శరీరంలోని వైరస్ అత్యంత ప్రమాదకరం!

Update: 2022-02-02 02:30 GMT
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచదేశాల్లో రోజూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే దశలవారీగా కొన్ని రోజులు ఎక్కువ సంఖ్యలో... కొన్ని రోజులు సాధారణంగా రికార్డు అవుతున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేళల్లో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కాగా గత వారం రోజుల నుంచి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతి తర్వాత వారంలో విపరీతంగా పెరిగిన మహమ్మారి కేసులు... ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే బాధితుల క్వారంటైన్ సమయాన్ని తగ్గించారు. వారం రోజుల్లో వైరస్ నుంచి కోలుకుంటారని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందని మరికొందరు అంటున్నారు.

వైరస్ బాధితులు వారం రోజుల్లో కోలుకుంటున్నారని... అందుకే క్వారంటైన్ సమయాన్ని తగ్గించారు. అయితే బాధితులందరికీ ఒకేలాగా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కొందరిలో ఈ వైరస్ ఏకంగా 70 రోజుల పాటు యాక్టివ్ ఉంటున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అంతేకాకుండా అరుదుగా మరికొందరిలో 232 రోజులు దాకా క్రియాశీలకంగా ఉంటుందని చెప్పారు. కాగా వీరు పది రోజుల్లో సాధారణంగా మారిపోతున్నారని... వైరస్ కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు ఉండవు అని చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోయినా వ్యాప్తి చెందే గుణం మాత్రం ఉంటుందని తెలిపారు. పైకి వారికి వైరస్ లేనట్లు కనిపించినా... వారి శరీరంలో వైరస్ ఉంటుందని అంటున్నారు. అది చాలా ప్రమాదకరమని... తెలియకుండానే చాలామందికి విస్తరిస్తుందని చెబుతున్నారు.

అలాంటి బాధితుల్లో వైరస్ ఎక్కువ కాలం పాటు వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇక వారు వైరస్ ను అత్యధికంగా వ్యాప్తి చేస్తారని పేర్కొన్నారు. ఇలా చేస్తే మళ్లీ ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి బాధితుల క్వారంటైన్ సమయాన్ని తగ్గించవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 15 రోజుల పాటు ఉంచాలని పేర్కొన్నారు. లేదంటే పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగి... ప్రమాద ఘంటికలు మోగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా అశ్రద్ధ చేయకుండా నిబంధనలు పాటించాలని అంటున్నారు. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు.

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నాలుగు లక్షల పాజిటివ్ కేసుల దాకా పోయి... ఆ తర్వాత దిగువకు చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వేల కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగాయి. అయితే వెంటనే కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. రెండో డోసునూ ప్రతీఒక్కరూ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు పంపిణీ కూడా కొనసాగుతోంది.
Tags:    

Similar News