రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ లోక్ సభ సీటు ని ఆశిస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆయన రెండేళ్ళ ముందు నుంచే రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సీటు కోసం కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పోటీ పడుతున్నారు. ఆమె రెండు సార్లు విశాఖ నుంచి పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఘన విజయం సాధించడమే కాదు కేంద్రం లో మంత్రి కూడా అయ్యారు.
ఇక 2019లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు కానీ డిపాజిట్లు దక్కలేదు. పొత్తులు లేకపోవడం వల్ల బీజేపీ ఓడిపోయింది. ఇదిలా ఉంటే 2024లో కూడా విశాఖ నుంచే పోటీ చేయాల ని పురంధేశ్వరి డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అత్తింటి వారిది ప్రకాశం జిల్లా. అయితే ఆమె 2004లో తొలిసారి బాపట్ల నుంచి ఎంపీ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009 నాటికి ఆ సీటు ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆమె విశాఖ కు షిఫ్ట్ కావాల్సి వచ్చింది.
ఇక 2014లో బీజేపీ లో చేరాక ఆమె రాజంపేట నుంచి కూడా పోటీ చేసి టీడీపీ తో పొత్తు ఉన్నా ఓటమి పాలు అయ్యారు. గట్టిగా చెప్పాలీ అంటే పురంధేశ్వరి కి పోటీ చేసేందుకు సొంత సీటు లేదు. ఆమె విశాఖనే నమ్ముకున్నారని అంటారు. వలస పక్షుల కు అడ్డా అయిన విశాఖ ఎంపీ సీట్లో ఈసారి పోటీ చేస్తే బీజేపీ కి కొంత పట్టు ఉంది, పొత్తులు ఉంటే ఈజీ గా గెలవవచ్చు అన్నది ఆమె ఆలోచన అంటున్నారు.
ఇక జీవీఎల్ ని తీసుకుంటే ఆయన కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారే. ఆయన గతం లో నరసారావు పేట నుంచి పోటీకి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. ఆయన పుట్టిన ప్రాంతం అక్కడే ఉంది అని అంటారు. అయితే సామాజిక సమీకరణ రిత్యా అక్కడ గెలుపు కష్టం అని భావించిన మీదటనే ఆయన విశాఖ వైపు చూపు మరల్చారని అంటున్నారు. ఆయన సామాజిక వర్గం అయిన బ్రాహ్మణులు విశాఖ లో రెండు లక్షల మంది ఉన్నారు.
దాంతో తాను విశాఖ బరి లో ఉంటాను అని కేంద్ర పెద్దల కు చెప్పిన మీదటనే జీవీఎల్ విశాఖ కు షిఫ్ట్ కావడం సొంత ఇల్లు కూడా కొనుగోలు చేసి రెండేళ్ల నుంచి విశాఖ కార్యక్షేత్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే జీవీఎల్ కి జాతీయ స్థాయిలో మూల విరాట్టుల తోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఆయన నెట్ వర్క్ కూడా గట్టిది అని అంటున్నారు. కేంద్ర పెద్దల సూచనల తోనే జీవీఎల్ విశాఖ బరి లో నిలబడబోతున్నారు అని అంటున్నారు. ఆరెస్సెస్ ఏబీవీపీ బీజేపీల లో దశాబ్దాలుగా పనిచేసిన జీవీఎల్ కి పెద్దల దన్ను ఉందని అంటున్నారు. దాంతో ఆయన విశాఖ సీటు తనదే అన్న ధీమాతో ఉన్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా అనూహ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి ఇపుడు రేసు లోకి వచ్చారని అంటున్నారు. ఆమెను కేంద్ర పెద్దలు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేశారు. దాంతో ఆమె కోరుకున్న సీటు లో పోటీ చేసేందుకు వీలు కుదిరింది అని అంటున్నారు. ఈ నేపధ్యం లో జీవీఎల్ కూడా దూకుడు పెంచేశారు.
ఆయన తన పుట్టిన రోజు ను మొదటిసారి విశాఖ వేదికగా చేసుకున్నారు. విశాఖ నిండా ఆయన హోర్డింగులు కటౌట్లు పెట్టేశారు నిరంతర శ్రమ జీవి గా కూడా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకే జీవీఎల్ తన పుట్టిన రోజు వేడుకల ను ఈసారి అట్టహాసంగా చేసుకున్నారని అంటున్నారు.
దీనిని బట్టి చూస్తే జీవీఎల్ వర్సెస్ పురంధేశ్వరిగా విశాఖ లో సీటు వార్ సాగుతోంది అంటున్నారు ఎవరికి ఈ ఇద్దరి లో విశాఖ సీటు దొరుకుతుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. కేంద్ర పెద్దల కు ఇపుడు ఇద్దరూ సన్నిహితులైన వారే కావడం తో ఎవరికి విశాఖ ఎంపీ టికెట్ ఇస్తారు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా తగ్గేదే అన్నట్లుగా జీవీఎల్ వర్సెస్ పురంధేశ్వరిల మధ్య సీటు వార్ సాగుతోంది అంటున్నారు.