హోదా సాధనలో భాగంగా ఏపీ యువత పిలుపునిచ్చిన మౌన దీక్ష విషయంలో పోలీసులు కరకుగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. మరోరోజులో సీఐఐ సమావేశం జరుగుతున్న వేళ.. విశాఖలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చేయాలన్న పట్టుదలతో ఏపీ సర్కారు ఉంది. ఇందుకు తగ్గట్లే హోదామీద శాంతియుతంగా జరపాలనుకున్న దీక్షకు అనుమతి ఇవ్వలేదు.విశాఖలో జరపాలనుకున్న దీక్షను రెండు భాగాలుగా చేస్తున్నారు. ఉదయం ఏపీ యువత మౌనదీక్షకు పిలుపునిస్తే.. సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని ఏపీ విపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మౌనదీక్ష విషయంలో ఏ చిన్న అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఏపీ పోలీసులు.. జగన్ విషయంలోనూ పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.మధ్యాహ్నం తర్వాత విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చే పక్షంలో జగన్ ను..విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండానే అడ్డుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ విమానంలో కాకుండా.. రోడ్డుమార్గంలో వచ్చే పక్షంలో విశాఖ శివార్లలోనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలన్న ఆలోచలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ ను విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండాచూడటం.. ఒకవేళ రోడ్డుమార్గంలో వచ్చే పక్షంలో విశాఖలో అడుగు పెట్టే ముందే ఆయన్ను అదుపులోకి తీసుకొని వెనక్కి పంపించాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరీ నేపథ్యంలో జగన్ విశాఖ టూర్ ఏ విధంగా సాగుతుందన్నది ఇప్పుడు మరింత ఉత్కంట రేపుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/