బీజేపీలో విష్ణు మాయ.. అనేదీ మీరే... తప్పించుకునేదీ మీరే.. నిందలు మీడియా పైనా?!
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. స్వపక్షంలో విపక్షంగా ఉన్న విశాఖకు చెందిన విష్ణుకుమార్ రాజు తాజాగా మీడియాపై నిప్పులు చెరిగారు. తాను పార్టీ మారుతున్నట్టు మీడియా నోటికి వచ్చినట్టు వాగుతోందని(చానెళ్లలో), చేతికి వచ్చినట్టు రాస్తోందని(పేపర్లలో) విరుచుకుపడ్డారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మారుతారనే వాదనలు రాజకీయం గా జరుగుతున్న కుట్రగా విమర్శించారు. వార్తలు వాళ్లకు నోటికొచ్చినట్లు రాస్తారని, ఇదొక రాజకీయ కుట్రలో భాగంగా కొంత మంది చేస్తున్న ప్రచారమని వ్యాఖ్యానించారు.
ఇవన్నీ రాజకీయాల్లో సహజమని, ఇలాంటి వాటికి తాను స్పందించాల్సిన అవసరం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో సమస్యపైనా నెలరోజులపాటు చార్జీషీటు దాఖలు చేసి ఫిర్యాదు చేస్తామన్నారు.
పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని విష్ణుకుమార్ రాజు చెప్పారు. 2019లో ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతానని తనకు తెలుసునని.. అయినప్పటికీ పార్టీ మారలేదని చెప్పారు. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతో తాను లేనన్నారు.
అయితే.. అసలు విష్ణుకుమార్ రాజు పార్టీ మారతారని.. ఎవరు చెప్పారు? అంటే.. ఆయనే చెప్పుకొచ్చారు. ప్రజలు కోరుకుంటు న్నారని.. బీజేపీ పుంజుకునే పరిస్థితిలో లేదని.. వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలుకలిస్తే.. తప్ప.. బీజేపీ గట్టెక్కదని ఆయన అన్నారు.
బీజేపీ పరిస్థితి ఇలానే ఉంటే.. తాను సాహసం చేయక తప్పదని కూడా వ్యాఖ్యానించింది.. విష్ణు కుమార్ రాజే. అంతేకాదు.. తన నియోజకవర్గం ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు.. అంటూ పరోక్షంగా తాను పార్టీ మారే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా తనకు ఆహ్వానాలు అందుతున్నాయన్న పెద్ద మనిషి కూడా ఆయనే. కానీ, బీజేపీ పెద్దల నుంచి ఆయనకు తాఖీదులు అంది.. పరిస్థితి పీకల వరకు వచ్చేసరికి మాత్రం విష్ణుకుమార్ రాజు ప్లేటు ఫిరాయించి.. అసలు పార్టీ మారతానని చెప్పిందెవరంటూ.. ఉల్టా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఎవరో జంపింగ్ జిలానీ ఈ మాటలు అన్నారంటే అర్ధం ఉంది. కానీ, నీబద్ధత గల నేతగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునే రాజు గారు.. తనే నోరు జారి.. ఇలా మీడియాపై అక్కసు వెళ్లగక్కడం ఎంత వరకు సమంజసమని అంటున్నారు పరిశీలకులు.