కొన్నిసార్లు అబద్ధాలు నిజం అయిపోతాయి. ఒక అసత్యాన్ని అదే పనిగా చెబుతున్నప్పుడు.. దాన్ని ఖండించకుండా మౌనంగా ఉండే జరిగే డ్యామేజ్ ఇది. అసత్యం మాత్రమే అదే పనిగా వినిపిస్తున్నప్పుడు.. సత్యం మౌనంగా ఉంటే.. ఎవరైనా వినిపించే అసత్యాన్ని నమ్ముతారే కానీ.. మౌనంగా కూర్చున్న సత్యాన్ని వెతికి మరీ.. ఇది నిజమని ఎవరూ అనలేరు కదా?
ఏపీ బీజేపీ తీరు సైతం ఇప్పుడిలానే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణమైన ఓటమికి గురైంది. ఏపీ ప్రజలంతా జగన్ వెనుకనే ఉన్నారన్న విషయాన్ని పోలైన ఓట్లతో స్పష్టమైంది. బాబు పాలనపై ఉన్న చిరాకు.. నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన అనుసరిస్తున్న విధానాలపై ఏపీ ప్రజల్లో భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ఫలితంగా ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి.
ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఏపీకి చెందిన బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురి చేయటమే కాదు.. గందరగోళంలో పడేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతల మాటలు చూస్తే.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిచేలా చేసింది తామేనని చెప్పుకుంటున్నారు. ఒకవేళ.. ఏపీ బీజేపీకి అంతటి సీనే ఉంటే.. ఆ పార్టీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా.. తమ ఉనికిని చాటేలా ఓట్లు తెచ్చుకున్నదా? అంటే అది లేదు. అలాంటప్పుడు ఏపీలో జగన్ పార్టీ గెలుపులో ఏపీ బీజేపీ పాత్ర ఏమీ లేదన్న విషయం చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది.
అయితే.. విష్ణుకుమార్ రాజు లాంటి ఏపీ బీజేపీ నేతలు.. చిత్ర విచిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 40 సీట్లు కూడా గెలుచుకోలేదని.. తాము గెలిపించబట్టే అన్ని సీట్లు గెలిచారు కానీ.. లేకుంటే లేదన్న మాటతో పాటు.. ఆ విషయం అందరికి తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో ఆగితే ఆయన్ను విష్ణుకుమార్ రాజు అని అనలేరు. ఎందుకంటే.. తాము గెలిపించాం కాబట్టి.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ వ్యవహారశైలి మార్చుకోవాలన్న విష్ణు హెచ్చరికలు దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
విష్ణు లాంటి వారి వ్యాఖ్యల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అస్సలు లెక్కలోకి తీసుకోవటం లేదు. ప్రజల్లో ఎవరి బలం ఎంతన్న విషయం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా విష్ణు లాంటోళ్లు మాట్లాడిన మాటలకు స్పందిస్తే.. అనవసర ప్రాధాన్యత కల్పించినట్లుగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ.. ఇంత నేరుగా.. అది కూడా హెచ్చరికలు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని షురూ చేసిన తర్వాత కూడా మౌనంగా ఉంటే.. అబద్ధ ప్రచారం కాస్తా నిజంగా మారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని జగన్ టీం గుర్తుంచుకోవాలి. ఈ తరహా వ్యాఖ్యల్ని మొగ్గలోనే తుంచేస్తే.. మరిన్ని మాటలు మిగలకుండా ఉంటారన్న నిజాన్ని మర్చిపోకూడదు. మరి.. దీనిపై జగన్ థింక్ ట్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.