క్రికెట్ దిగ్గ‌జం కుమార్తె... హైద‌రాబాద్ కోడ‌లు!

Update: 2016-08-14 13:12 GMT
క్రికెట్ దిగ్గ‌జం వీవ్ రిచ‌ర్డ్స్ పేరు వినే ఉంటారు. అల‌నాటి వెస్టిండీస్ జ‌ట్టులో స్టార్ ఆట‌గాడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. అప్ప‌ట్లో ఇండియాకి చెందిన బాలీవుడ్ న‌టి నీనా గుప్తాని ప్రేమించి వివాహం చేసుకున్నాడు రిచ‌ర్డ్స్‌. త‌రువాత, వారికి ఒక కుమార్తె మ‌సాబా గుప్తా జ‌న్మించింది. అయితే, ఇప్పుడు మ‌సాబా తిరిగి భార‌తదేశానికి కోడ‌లిగా రావ‌డం విశేషం. అదీ హైద‌రాబాద్‌ కి కోడ‌లిగా రావ‌డం మ‌రీ విశేషం. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఒక ప్ర‌ముఖుడిని వివాహం చేసుకోవ‌డం ఇంకో విశేషం! హైద‌రాబాద్‌ కు చెందిన నిర్మాత‌ - ద‌ర్శ‌కుడు మధు మంతెన‌తో మాసాబా వివాహం గ‌త ఏడాది జ‌రిగింది. వీరిది కూడా ప్రేమ వివాహం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం చాలామందికి తెలీదు. రెండు రోజుల కింద‌ట హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన మ‌సాబా ఈ విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది.

చిన్న‌తనం నుంచి త‌న‌కి ఫ్యాష‌న్ రంగం అంటే చాలా ఇష్ట‌మ‌నీ  త‌న త‌ల్లిదండ్రులు కూడా ప్రోత్స‌హించ‌డంతోనే ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా సెటిల్ అయ్యాన‌ని మ‌సాబా చెప్పారు. హైద‌రాబాద్‌ కు చెందిన మ‌ధు మంతెన‌తో ఒక‌సారి ప‌రిచ‌యం అయింద‌నీ, తొలి పరిచ‌యంలోనే అత‌ని నిజాయ‌తీ నాకు చాలా న‌చ్చింద‌న్నారు. ఆ గుణం న‌చ్చ‌డంతోనే ఆయ‌న్ని వ‌దులుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పారు. అలా వారిద్ద‌రి మ‌ధ్యా ప్రేమ చిగురించిందనీ, స‌రిగ్గా మూడు నెల‌ల ప్రేమాయ‌ణం అనంత‌రం 2015లో ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నామ‌ని మ‌సాబా చెప్పారు.

మ‌ధు త‌న సినిమా ప‌నుల విష‌యంలో బిజీగా ఉంటూ ఎక్కువ‌గా ముంబైలో ఉంటార‌ని ఆమె చెప్పారు. హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంద‌ని ఆమె అన్నారు. అంద‌రూ త‌న‌ని హైద‌రాబాదీ కోడ‌లు అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంద‌ని మ‌సాబా చెప్పారు. తెలుగువారి కోడ‌లిని అనిపించుకోవ‌డం మ‌రింత గ‌ర్వ‌గా అనిపిస్తుంద‌ని ఆమె చెప్పారు.
Tags:    

Similar News