దేశం లో సుపరిచిత టెలికాం నెట్ వర్క్ లలో ఒకటైన వోడాఫోన్ భారత మార్కెట్ నుంచి ఎగ్జిట్ కానుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది. తాజాగా ఈ కంపెనీ కి చెందిన టాప్ మేనేజ్ మెంట్ ఇస్తున్న సంకేతాల్ని చూస్తుంటే.. అలాంటి పరిస్థితి చోటు చేసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను కచ్ఛితం గా అమలు చేయాలంటే.. ఆ కంపెనీ భారత్ నుంచి వైదొలగటానికి మించి మరో అవకాశం లేదంటున్నారు.
తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయిల బకాయిల విషయం లో ప్రభుత్వం ఊరట కల్పించాలని.. లేదంటే భారత్ లో కంపెనీ ఫ్యూచర్ ప్రశ్నార్థకం లో పడనుందంటూ గ్రూప్ సీఈవో నిక్ రీడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి. బ్రిటిష్ టెలికాం దిగ్గజమైన వోడాఫోన్ భారత్ లో ఇప్పుడు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటోంది.
ఏ నెలకు ఆ నెల లక్షలాది మంది కస్టమర్లు ఇతర నెట్ వర్క్ లకు మారి పోతుండటం ఒక పెద్ద సమస్య అయితే.. కంపెనీ ఆర్థిక స్థితిని తీవ్రం గా ప్రభావితం చేసే సుప్రీం కోర్టు కారణం గా కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. భారత్ మార్కెట్లో సవాళ్లు బలంగా ఉన్నాయని.. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేదన్న మాట వినిపిస్తోంది. టెలికాం శాఖకు.. టెల్కోలకు మధ్య నడుస్తున్న వివాదం లో టీడీశాట్ టెల్కోలకు అనుకూలంగా తీర్పును ఇస్తే.. సుప్రీం కోర్టు మాత్రం ఇందుకు భిన్నం గా టెల్కోలకు ప్రతికూలం గా తీర్పును ఇచ్చింది.
దీంతో.. టెల్కోల మీద భారీ గా భారం పడనుంది. ఉదాహరణకు ఈ వివాదంలో ఎయిర్ టెల్ సంస్థ భారత ప్రభుత్వానికి రూ.21,700 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. వోడాఫోన్ రూ.28,300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా టోల్కోల కంపెనీల మీద రూ.1.4లక్షల కోట్ల భారం పడింది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించే పరిస్థితుల్లో వోడాఫోన్ లేదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని.. కంపెనీ చెల్లించాల్సిన మొత్తాన్ని భారీ ఎత్తున తగ్గిస్తే తప్పించి.. కంపెనీ భారత్ లో తన కార్య కలాపాల్ని కొనసాగే వీలు లేదంటున్నారు. వోడాఫోన్ భవితవ్యం కేంద్ర సర్కారు చేతి లో ఉందన్న మాట బలం గా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.