మీరు ఐడియా - వోడాఫోన్ నెట్ వర్క్ ఉపయోగిస్తున్నారా? లేదంటే.. మీ ఇంట్లో కానీ.. బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఈ నెట్ వర్క్ ఉపయోగించే వారికి దిమ్మ తిరిగిపోయే షాక్ సిద్ధమవుతుందా? అంటే అవునని చెప్పాలి. ఇప్పటికే ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంలో కిందా మీదా పడుతున్న ఈ టెలికం సంస్థ.. షాకింగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
తాజా ప్రతిపాదనతో తన నెట్ వర్క్ వినియోగించుకునే వినియోగదారుల వీపు వాచి పోయేలా టారిఫ్ ను సిద్ధం చేసిన వైనం బయట కు వచ్చింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న కాల్ ఛార్జీలతో పాటు.. డేటా చార్జీలకు కనీసం ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెంచాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.
ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలకు భిన్నంగా అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జీని నిమిషానికి ఆరు పైసలుగా నిర్ణయించింది. అదే సమయం లో ప్రస్తుతం ఒక బీజీ డేటాకు వసూలు చేస్తున్న రూ.4-5 బదులుగా ఒక జీబీకి రూ.35 మొత్తాన్ని వసూలు చేయాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాడు.. కనీస నెలసరి కనెక్షన్ ఛార్జీ రూ.50 ఉండాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది. తాను ప్రతిపాదించిన కొత్త టారిఫ్ లను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అయ్యేలా అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది.
ఈ దెబ్బతో ఈ నెట్ వర్క్ లో ఉన్న వినియోగదారులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారింది. మార్కెట్లో వినియోగదారుల వాటా తగ్గటం.. ఏజీఆర్ బకాయిల చెల్లింపు భారం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ధరల్ని పెంచాలన్న నిర్ణయం ఐడియా - వోడాఫోన్ ను ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.