సీరమ్ వ్యాక్సిన్ పై వలంటీర్ సంచలన ఆరోపణలు..భారీ జరిమానా విధిస్తామన్న సంస్థ..!
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలో కూడా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తీసుకొస్తున్న కోవాగ్జిన్ అశాజనక ఫలితాలు ఇస్తోంది. మరోవైపు రెడ్డి ల్యాబ్స్ కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీని అభివృద్ధి చేస్తున్నది. అయితే ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి పూణేకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ పై ఓ వలంటీర్ సంచలన ఆరోపణలు చేశాడు. వ్యాక్సిన్ వేయించుకున్నాక తనకు నాడీ సంబంధిత వ్యాధి వచ్చిందని సదరు వ్యక్తి ఆరోపించాడు.
ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే సీరమ్ ఇన్ స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేసి తనకు రూ. 5కోట్లు పరిహారం చెల్లించాలని సదరు వ్యక్తి ఆ సంస్థకు నోటీసులు పంపాడు. ఈ విషయం పలు మీడియాల్లో వచ్చింది. సోషల్‌మీడియాలోనూ ప్రకంపణలు సృష్టించింది. అయితే దీనిపై సీరమ్ సంస్థ స్పందించింది. వ్యాక్సిన్ ప్రయోగానికి వలంటీర్ ఆరోగ్యపరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని సీరమ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమపై నిందలు వేస్తున్నారని సంస్థ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వాలంటీర్ పై వంద కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని వేస్తామని సంస్థ హెచ్చిరించింది.
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సీరం ఇన్ స్టిట్యూట్ చీఫ్ అధర్ పూనావాలా చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ - ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం శనివారం సీరం ఇన్ స్టిట్యూట్ ను సందర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ భద్రతపై వలంటీరే స్వయంగా ఆరోపణలు చేయడం పెను సంచలనంగా మారింది. వలంటీర్ ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది.