ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా మన తాహతకు సరిపడా ఏదైనా చిన్న జాబ్ చూసుకోవాలనే తాపత్రయం ప్రతీ నిరుద్యోగికి ఉంటుంది. దేశ అత్యున్నత పోస్టుల కంటే ఈజీగా వచ్చే రాష్ట్ర పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులకే నిరుద్యోగులు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ పైగా జిల్లాలోనే ఉద్యోగం ఇంటిపట్టున ఉండొచ్చని ఆసక్తి చూపిస్తారు.
అయినా ఈ కాలంలో ఉద్యోగాల భర్తీనే లేదు. అందుకే ప్రభుత్వం కంపోడర్, అటెండర్ పోస్టులకు సైతం గంపెడు దరఖాస్తులు వస్తున్నాయి. ఈ కోవలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పోస్టులను ఏపీలోని జగన్ సర్కారు తీసుకొచ్చింది. వాటిని భర్తీ కూడా చేసేసింది. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందించే డ్యూటీని వీరిపైన పెట్టింది.
అయితే ఉద్యోగాల్లో చేరడానికి పెద్ద తంతగమే నడిచింది. గ్రూప్ 2 లెవల్లో పరీక్ష రాసి పాసి అయి ఈ కొలవుల్లో చేరారు. పరీక్ష అంత కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఈ సచివాలయ ఉద్యోగాల్లో పీజీ, డిగ్రీ చేసిన వారు ఎక్కువగా విధుల్లో చేరారు. వీరిలో పలువురికి తాజాగా ఇంతకంటే ఎక్కువ జీతం, మెరుగైన రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాలు వచ్చాయి. వారు ఈ సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్లాలనుకున్నారు. కానీ వదలడం అంత ఈజీకాదని తాజాగా ప్రభుత్వం వారికి గట్టి షాక్ ఇచ్చింది.
ప్రభుత్వ కఠిన నిబంధనలతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ ఉద్యోగాన్ని వదిలివెళ్లడం అంత ఈజీ కావడం లేదు. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామాను ఆమోదిస్తామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారట.. లేదంటే మెరుగైన ఉద్యోగం వదలుకొని చచ్చినట్టు ఈ సచివాలయ ఉద్యోగం చేయమంటున్నారట.. అంత మంచి జీతం వచ్చే బయటి ఉద్యోగాలకు పోలేక.. ఈ వేలు మాత్రమే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలలేక ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారు నరకయాతన పడుతున్నారట.. ఇలాంటి నిబంధనలు ఎక్కడా ఉండవని.. తమ భవిష్యత్ కోసం సడలించాలని సర్కారును కోరుతున్నారు.