దేశంలో మరెవరికీ లేని సౌకర్యం.. సదుపాయం ఏపీ ఓటర్లకు దక్కనుంది. దేశంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఒక కొత్త విధానానికి ఏపీని ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఏపీలోని ఏ ఓటు అయినా.. ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే పోలింగ్ కేంద్రానికి వెళ్లే సౌకర్యం కలగనుంది. ఇప్పటివరకూ ఇలాంటి అవకాశం లేనందున.. భర్త ఒక చోట.. భార్య మరోచోట ఓటు వేసే పరిస్థితి.
దీనికి చెక్ చెబుతూ కుటుంబం మొత్తం ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు నిర్వహించుకునే వీలుంది. దీనికి సంబంధించిన కార్యక్రమం తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు.. కడప.. నెల్లూరు.. కర్నూలు జిల్లాకు చెందిన నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రయోగం కానీ ఏపీలో విజయవంతం అయితే.. దేశంలోని మహానగరాల్లో ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.