టెకీలకు ఆఫర్ ఇచ్చిన వాల్ మార్ట్

Update: 2018-08-07 10:09 GMT

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.  ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైట్ చేయడంతో అమెరికాలోని ఐటీ నిపుణులందరూ తిరిగి ఇండియాకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. దేశీయంగా కూడా పరిస్థితి బాగా లేని తరుణంలో అమెరికా రిటైల్ కంపెనీ వాల్ మార్ట్ టెకీ నిపుణులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ భారత్ లో భారీ పెట్టుబడులతో కాక రేపుతోంది. మొన్నీ మధ్యనే భారత్ లోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్టును లక్ష కోట్లకు కొని ఆశ్చర్యపరిచింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద డీల్స్ లో ఒకటిగా నిలిచింది. ఫ్లిప్ కార్టులో 20శాతం వాటా ఉన్న జపాన్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కూడా తన వాటాను వాల్ మార్ట్ కు అమ్మేసింది. మొత్తం ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు వాల్ మార్ట్ 60శాతం వాటాతో మెజార్టీ వాటాదారుగా ఫ్లిప్ కార్ట్ ను శాసిస్తోంది.

ఇలా ఫ్లిప్ కార్ట్ తోనే వాల్ మార్ట్ ఆగిపోలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తన వాల్ మార్ట్ రిటైల్ షాపులను ఏర్పాటు చేసేందుకు భారీ పెట్టుబడులు పెడుతోంది. తన వ్యాపార కార్యకలాపాలను ఇండియాలో భారీగా విస్తరిస్తోంది.

తాజాగా వాల్ మార్ట్ తను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్ ఈకామర్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వెయ్యిమంది టెకీలను నియమించుకునేందుకు నిర్ణయించింది. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం దేశీయ ఐటీ నిపుణులకు రూ. 6 లక్షల నుంచి 22 లక్షల వరకూ వేతనాలు ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.. అమెరికా వెలుపల వాల్ మార్ట్ నిర్వహిస్తున్న అతిపెద్ద రిక్రూట్ మెంట్ ఇదేనట.. సో భారతీయ టెకీలందరూ అవకాశం ఉంటే ప్రయత్నించవచ్చని ఎకనామిక్స్ టైం కోరింది.
Tags:    

Similar News