లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా బంద్ కావటం.. అన్ లాక్ లో భాగంగా కొంతమేర పునరుద్దరించినా.. అదేమీ లాక్ డౌన్ ముందున్న పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదన్నది మర్చిపోకూడదు. కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. ఆర్థికంగా వెనుకటి పరిస్థితికి ప్రభుత్వాలు చేరుకోవాలంటే.. మరిన్ని రాకపోకలు తప్పవని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు నుంచి మొదలయ్యే అక్టోబరు త్రైమాసికానికి సంబంధించి ఏపీ నుంచి తెలంగాణకు సర్వీసుల్ని భారీగా పెంచేస్తున్నారు.
కాకుంటే.. ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసుల్ని భారీగా పెంచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి.. పెరుగుతున్న సర్వీసులతో హైదరాబాద్ కు రావాలనుకున్న వారు ఈజీగా వచ్చేయొచ్చు. గతంలో మాదిరి కారులో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. దీంతో ఖర్చు భారీగా పెరిగాయి. తాజాగా ప్రైవేటు బస్సులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చేస్తున్న నేపథ్యంలో సామాన్యులకు ఊరట లభించే వీలుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా వచ్చే ప్రైవేటు బస్సుల్లో చార్జీల పోటు భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు. ఒక్కో టికెట్ మీద తక్కువలో తక్కువ రూ.200 నుంచి రూ.400 వరకుపెంచనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా చోటు చేసుకున్న నష్టంతో పాటు.. శానిటైజేషన్ తదితరాలకు అయ్యే ఖర్చు..ప్రయాణికుడి నెత్తిన భారంగా మారనున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ స్లీపర్ రూ.850 ఉంటే.. ఇప్పుడు అది ఏకంగా రూ.1200లకు చేరుకుంది. ఇదంతా చూస్తే.. ఏపీ నుంచి హైదరాబాద్ కు రావాలంటే కాస్త ఖరీదైన వ్యవహారమేనని చెప్పక తప్పదు.