కశ్మీర్ విషయంలో...పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ గింజుకోవడం కొనసాగుతోంది. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి తొలగింపు విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో ఒత్తిడి కోసం ప్రయత్నిస్తున్న ఆయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా యుద్ధం గురించి ప్రకటనలు చేశారు. భారత దేశం పై యుద్దానికి వెళ్తాం సిద్దంగా ఉండండి అంటూ ఆదేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. . ‘రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అందుకు అంతర్జాతీయ సమాజానిదే బాధ్యత’ అంటూ బ్లాక్‌మెయిల్ ప్రకటనలు చేశాడు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ అసెంబ్లీలో పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్రాన్ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. కశ్మీర్ లో ప్రస్తతం ఉన్న పరిణామాలు అక్కడి ముస్లింలను ఆందోళనకు గురి చేస్తున్నాయని మతం సెంటిమెంట్‌ను ప్రస్తావించారు. భారత్‌లో ముస్లింలే లక్ష్యంగా మూక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ సిద్దంగా ఉందని, భారతదేశంపై యుద్దానికి వెళ్తాం సిద్ధంగా ఉండండి అంటూ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒకవేళ తమ దేశం జోలికి భారత్ వస్తే అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఇమ్రాన్ మరింత రెచ్చగొట్టే కామెంట్లు చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించడం మోదీ చేసిన వ్యూహాత్మక తప్పిదమని ఆరోపించారు. ``చివరి కార్డ్ ఉపయోగించిన మోదీ, బీజేపీ మూల్యం చెల్లించక తప్పదు. కశ్మీర్ అంశాన్ని వారు అంతర్జాతీయం చేయడమే ఇందుకు కారణం’’ అని ఇమ్రాన్ అన్నారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 రద్దు - రాష్ట్ర పునర్విభజనను అంతర్జాతీయ సమాజం పట్టించుకోకపోవడంపైనా అసహనం వ్యక్తంచేశారు. తాను కశ్మీర్ గొంతుకై ఐక్యరాజ్యసమితి సహా.. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా తన గళాన్ని వినిపిస్తానని ప్రకటించారు. ‘‘ఒకవేళ ఎలాంటి చర్యలకు పాల్పడినా ప్రతి ఇటుకకూ ఒక్కో రాయితో సమాధానం చెబుతాం’’ అని ఇమ్రాన్ తమ దేశ పౌరులను రెచ్చగొట్టారు.