యూపీ ఎన్నికల వేడి తెలంగాణలో రాజుకుంటోంది. అక్కడి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాటల మంటలు రేపారు.
తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి కేటీఆర్ ఆ హీట్ పై నీళ్లు చల్లుతున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంత్రి కేటీఆర్ సెటైర్లు సంధించారు. దీనిపై మళ్లీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ తో యూపీ వేడి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ఓటర్లకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామని.. వాళ్ల ఇళ్లను జేసీబీలు, బుల్ డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. వచ్చేది యోగి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.
రాజాసింగ్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇవి జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజాసింగ్ ను ఓ మంచి కమెడియన్ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ వాళ్లు ఇంతకుమించి దిగజారలేరని అనుకున్నప్పుడు మరో అద్భుతమైన హాస్యనటుడు కనిపించాడని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ కు రాజాసింగ్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. బరాబర్ యూపీలో దేశద్రోహుల పైకి బుల్ డోజర్లు ఎక్కిస్తామని కౌంటర్ ఎటాక్ చేశారు. దీంతో ఆ వేడి మరింతగా రాజుకుంది.
యూపీలో ఎన్నికలు జరుగుతుంటే ఆ వేడి మొత్తం తెలంగాణలో కనిపిస్తోంది. అక్కడి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్ లు ఇస్తుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం ఆ హీట్ పై నీళ్లు చల్లుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది.
Full View Full View Full View Full View Full View Full View Full View