క్రికెట్ ను మరింత పాపులర్ చేసే పనిలో భాగంగా అమెరికాలో నిర్వహిస్తున్న టోర్నీలో మూడో మ్యాచ్ మగిసింది. క్రికెట్ దేవుడిగా అభివర్ణించే సచిన్ నాయకత్వంలో ఒక జట్టు.. షేన్ వార్న్ నేతృత్వంలో మరో జట్టుగా ఏర్పడి మూడు మ్యాచ్ ల సిరీస్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు నిర్వహించగా.. రెండు మ్యాచ్ లలోనూ వార్న్ జట్టు విజయం సాదించింది. తాజాగా జరిగిన మూడో మ్యాచ్ లోను వార్న్ జట్టు విజయం సాధించటం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన సచిన్ జట్టు ధాటిగా ఆడి భారీ స్కోర్ చేసింది. గంగూలీ.. సచిన్ లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. 20 ఓవర్ల వ్యవధిలో 219 పరుగులు చేశారు. 220 పరుగల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వార్న్ జట్టు.. లక్ష్య దిశగా దూసుకుపోయింది. వార్న్ జట్టులోని సైమండ్స్.. సంగక్కార.. కలిస్.. పాంటింగ్ లు రాణించటం.. చివరి బంతిని సిక్స్ గా మలిచిన వార్న్ కారణంగా.. మరో బంతి మిగిలి ఉండగానే వార్న్ విజయం సాధించింది. నిజానికి చివరి ఓవర్లో వార్న్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంటగా మారిన సమయంలో వార్న్ బంతిని సిక్సర్ కు చేర్చటంతో.. సచిన్ సేన ఒక్క విజయం సాధించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. గెలుపోటములు పక్కన పెడితే.. అమెరికాలో క్రికెట్ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావటంతో ఈ దిగ్గజ సీరిస్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.