కళ్లుతెరిచిన డబ్ల్యూహెచ్​వో.. కరోనా వూహాన్​లో పుట్టిందా? అని ఇన్వెస్టిగేషన్​

Update: 2020-12-23 16:30 GMT
కరోనా చైనా దేశం వూహాన్​లోని వైరాలజీ ల్యాబ్​లోనే పుట్టిందని చాలా కాలంగా సైంటిస్టులు ఆరోపిస్తున్నారు. అక్కడి మాంసం దుకాణాల్లో పుట్టిఉండవచ్చని మరికొందరి వాదన. అయితే కరోనా వైరస్​ పుట్టుకపై ఇప్పటికే మిస్టరీయే నెలకొన్నది. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్​గా ఉన్న డబ్ల్యూహెచ్​వో తాజాగా మేల్కొన్నది. కరోనా వూహాన్​లోని వైరాలజీ ల్యాబ్​లోనే పుట్టిందా.. అనే విషయంపై డబ్ల్యూహెచ్​వోకు చెందిన ఓ టీం పరిశోధన సాగించనున్నది.

కరోనా వైరస్​ సహజసిద్ధంగానే ఏర్పడిందా? లేక వూహాన్​ల్యాబ్​లో పుట్టి ప్రపంచదేశాలకు వ్యాపించిందా అన్న విషయంపై వీళ్లు పరిశోధనసాగించనున్నారు.  కరోనా వైరస్​ వూహాన్​ ల్యాబ్​లో పుట్టిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించాయి.  ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్​వో విచారణ సాగించనున్నది.  దీనిపై వూహాన్‌లోని ల్యాబ్‌లో చీఫ్ వైరాల‌జీ సైంటిస్టుగా ఉన్న 56 ఏళ్ల ప్రొఫెస‌ర్ షీ జెంగ్లీ  స్పందించారు.

డ‌బ్ల్యూహెచ్‌వో ప్రతినిధుల రాక గురించి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు చెందిన విలేకరితో ఆమె మాట్లాడారు. కరోనా వైరస్​పై విచారణ జరిపేందుకు ఎవరు వచ్చినా తాము సహకరిస్తాం.. అని ఆమె అన్నారు. వూహాన్​ ల్యాబ్​ చుట్టుపక్కలకు కూడా ఎవరూ వెళ్లలేరు. అక్కడ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఇటీవల కొందరు జర్నలిస్టులు వూహాన్​ ల్యాబ్​కు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు.  ఫొటోలు కూడా తీయనీయలేదు. వూహాన్​ వైరాలజీ ల్యాబ్​ సైంటిస్ట్​ ప్రొఫెసర్​ షీ జెంగ్లీ గతంలో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.
Tags:    

Similar News