హీరో సుదీప్ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసింది అతడి కార్ డ్రైవరా?

Update: 2023-04-06 15:01 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. అక్కడి స్టార్ హీరోల కు గాలం వేస్తోంది. వారిని సానుభూతితో తనవైపునకు తిప్పుకుంటోంది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సీఎం బసవరాజు బొమ్మైను కలిసి ఆయన తరుఫున ప్రచారానికి ఓకే చెప్పారు. తనకు బొమ్మై గాడ్ ఫాదర్ అని.. ఆయన కోసం ఏమైనా చేస్తానన్నాడు. కానీ బీజేపీలో చేరను.. పోటీచేయను.. కేవలం ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక బీజేపీ కి అండగా నిలిచిన కిచ్చా సుదీప్ కు బెదిరింపులు లేఖలు వచ్చాయి. ఆయన బీజేపీలో చేరితే ఆయన పర్సనల్ వీడియోలు లీక్ చేస్తామని.. వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు బహిరంగంగా ప్రజల ముందు పెడుతామని కొందరు సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ లెటర్లు రాశారు. దీని పై హీరో కిచ్చా సుదీప్ ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో ని పుట్టేనహళ్లి పోలీసులు  కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో షాకింగ్ విషక్ష్ం ఒకటి వెలుగుచూసింది.

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఏకంగా తమకు మద్దతు ఇచ్చిన సుదీప్ ను బెదిరించడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బ్లాక్ మెయిల్ చేసిన కేసును బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ కు అప్పగించామని సిటీ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేసిన కేసు సీసీబీ చేతికి వెళ్లింది.

అయితే సుదీప్ దగ్గర ఇటీవల పనిచేసి ఉద్యోగంలోంచి తీసేసిన కారు డ్రైవరే బెదిరించినట్టుగా అనుమానిస్తున్నారు. తనను ఉద్యోగంలోంచి తీసేశారనే కోపంతోనే మాజీ కారు డ్రైవర్ ఇలా సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చని ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులతో చెప్పారు.

ఇక పోలీసుల విచారణలో సుదీప్ మాజీ కారు డ్రైవర్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. అతడి కోసం గాలిస్తున్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు అంటున్నారు. కిచ్చా సుదీప్ కారు డ్రైవర్ మాత్రమే కాదు.. బీజేపీలో చేరడం ఇష్టం లేని మిగతా వారు ఏమైనా ఇలా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News