నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున గుండె పోటుతో మరణించాడన్న వార్త తెలియడంతో నియోజక వర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతదేహాన్ని నియోజకవర్గ కేంద్రమైన హాలియాకి తరలించారు.
కమ్యునిస్టు పార్టీలంటే నిబద్ధతకు, పోరాటానికి మారుపేరు అంటారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన నేత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా.. సీపీఎంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని పక్కనపెట్టి... గులాబీ కండువా కప్పుకున్నారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటి చేసి ఓటమి చెందినా... 2018లో రాష్ట్రస్థాయిలో బలమైన నాయకుడిగా పేరొందిన జానారెడ్డిపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. అయితే గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నా.. ఆయనను ఎర్రజెండా జ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానమొస్తోంది. ఆయన ఆఖరు మాటలు అంటూ ఫోన్ రికార్డులు ప్రచారమవుతున్నాయి.
‘భగవంతుడు నన్ను పిలిచాడు. ఎర్రజెండా నర్సింహయ్యగానే నా అంతిమ సంస్కారాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందిని తెలిసో, తెలియకో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అన్యథా భావించొద్దు. నర్రా రాఘవరెడ్డి శిష్యుడిగా, నకిరేకల్ ఎర్రజెండా బిడ్డగా.. ఎర్రజెండా బిడ్డగానే నన్ను సాగనంపుతారని కోరుకుంటున్నాను. ఇదే చివరి రాత్రి. ఆఖరు మాటలుగా భావించండి. రేపటి భవిష్యత్తు అంతా కమ్యునిస్టు పార్టీలది. మీరంతా కమ్యునిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు.
ఆ ఆడియోలు నిజం కావు : నోముల కుటుంబ సభ్యులు
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అవన్నీ ఫేక్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ఆడియాలు సృష్టించారంటున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు.