రామాల‌యానికి ముస్లిం ప్ర‌ముఖుడి విరాళం

Update: 2018-06-25 07:54 GMT
నిత్యం వివాదాస్ప‌ద వార్త‌ల్లో నిలిచే ముస్లిం ప్ర‌ముఖుడు ఒక‌రు ఊహించ‌ని విధంగా షాకిచ్చారు. అయోధ్య రామాల‌యం విష‌యంలో చాలామంది మైనార్టీల‌కు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తుండే ఆయ‌న‌.. తాజాగా అయోధ్య‌ రామాల‌యానికి విరాళాన్ని ఇచ్చి వార్త‌ల్లోకి ఎక్కారు.  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ రిజ్వీ ఆయోధ్య ప‌ట్ట‌ణాన్ని తాజాగా సంద‌ర్శించారు. అక్క‌డితో ఆగితే విష‌యం మ‌రోలా ఉండేది. ఎవ‌రూ ఊహించిన రీతిలో ఆయ‌న రామాల‌య నిర్మాణానికి త‌న వంతుగా రూ.10వేల మొత్తాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల కొత్త రాజ‌కీయ పార్టీని ప్రారంభించిన రిజ్వీ.. రామ‌జ‌న్మ‌భూమి న్యాస్ అధ్య‌క్షుడు మ‌హంత్ నిత్యా గోపాల్ దాస్ బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌ర్భంగా ఆల‌య వ‌ర్క్ షాపున‌కు వ‌చ్చి విరాళాన్ని ఇచ్చారు. రామాల‌యానికి విరాళం ఇచ్చినందుకు త‌న‌ను తీవ్ర‌వాద ముస్లింలు ఇస్లాం నుంచి వెలివేయొచ్చ‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.

అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లంలో రామాల‌య నిర్మాణం ప్రారంభ‌మైతే లౌకిక వాదులైన ముస్లింలు ప‌లువురు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తారంటూ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య చేశారు. మ‌రి.. రిజ్వీ వ్యాఖ్య‌ల‌పై ముస్లిం సంఘాలు.. నేత‌లు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News