బాబు మోహన్ కు షాకిచ్చిన సర్కారు..

Update: 2018-08-17 11:16 GMT
బాబు మోహన్ .. సినిమా నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ప్రస్తుతం అక్కడే సెటిలయ్యారు. ఈ మధ్యే మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. టీఆర్ ఎస్ ఆంథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగాను సేవలందించారు. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే బాబు మోహన్ కు తాజాగా జీహెచ్ ఎంసీ అధికారులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు..

జీహెచ్ ఎంసీకి పన్నుల భారం బాగా పెరిగిపోయింది. దీన్ని నివారించడానికి కఠిన చర్యలకు దిగింది. దీనికి ప్రభుత్వం కూడా సరేననడంతో ముందు వెనుకా ఆలోచించకుండా మొండి బకాయిదారుల పని పడుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇంటికి నల్లా కనెక్షన్ ను జీహెచ్ ఎంసీ అధికారులు తొలిగించారు.

హైదరాబాద్ లోని బాబుమోహన్ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లు బకాయి ఉందని అధికారులు తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్ ను కూడా అధికారులు కట్ చేయడం గమనార్హం. రవి ఇంటిపై రూ.3 లక్షల నల్లాబిల్లు బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. బకాయిల వసూళ్లలో అధికార టీఆర్ఎస్ నేతలను, ఏ ప్రముఖులను కూడా వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News