ఆర్థిక రాజధానిలో అందుబాటులోకి వాటర్ టాక్సీలు..!

Update: 2021-12-25 04:57 GMT
భారతదేశం ఆర్థిక రాజధాని అయిన ముంబై లో మరో రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నగరంలో ఉండే ట్రాఫిక్ సమస్యలను, రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త రవాణా వ్యవస్థకు తెర తీసింది. ఇప్పటి వరకు కేవలం రోడ్డు, రైలు మార్గాలు మాత్రమే ఉండే ముంబై లో కొత్తగా ప్రయాణానికి సంబంధించి వాటర్ టాక్స్ లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాటర్ టాక్సీలు సౌత్ ముంబై నుంచి నవీ ముంబై వరకూ ప్రయాణికులను చేర వేయనున్నాయి. అయితే ఈ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి అంటే మరికొన్ని నెలలపాటు ఎదురు చూడక తప్పదు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ వాటర్ టాక్స్ లను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. అయితే వీటి రవాణాకు సంబంధించి అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన బిడ్ లను ఆహ్వానించి వచ్చే ఏడాది నాటికి ఈ వాటర్ టాక్స్ లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

ప్రయాణాలు ఎక్కువగా చేసే రూట్ అయిన దక్షిణ ముంబై నుంచి నవి ముంబై వరకు ఈ వాటర్ టాక్స్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సుమారు 30 కిలోమీటర్ల కు పైగా ఈ వాటర్ టాక్స్ లు ప్రయాణికులను చేర వేయనున్నాయి. అయితే రైళ్లలో, బస్సుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని వాటర్ టాక్సీ లకు పచ్చజెండా ఊపినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది.

సౌత్ ముంబై నుంచి నవి ముంబై కి సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ వాటర్ టాక్సీలు సౌత్ ముంబై నుంచి బయలుదేరి వివిధ స్టాపుల్లో ఆగి నవి ముంబై కి ప్రయాణికులను చేరవయనున్నాయి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని నడిపేందుకు మూడు కంపెనీలు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాటర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

కేవలం 30 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబై కి చేరుకోవచ్చని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నగరవాసులకు వాటర్ టాక్సీలు మంచి ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయని పేర్కొన్నారు. అయితే వీటికి సంబంధించి ఖర్చు ఎలా ఉంటుంది అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంబంధిత సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న రూట్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు వాటర్ టాక్సీ సదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వాటర్ టాక్సీల నిర్ణయం పర్యాటకంగా కూడా ప్రభుత్వానికి మైలేజీ ఇస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.

వాటర్ టాక్సీలు భారీ వర్షాల సమయంలో మినహా మిగతా వేళల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న దాని ప్రకారం వచ్చే ఏడాదిలో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్తగా తీసుకువస్తున్నా రవాణా వ్యవస్థను ప్రజలు ఆదరిస్తారని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News