రూ.2000 నోట్లకు షాకింగ్ క్వాలిటీ

Update: 2016-11-14 13:04 GMT
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కొత్త రూ.2000 నోట్ల‌కు భ‌లే క్రేజ్ ఉంది. బ్యాంకుల్లో, ఏటీఎంల‌లో ఎక్క‌డ చూసినా కొత్త రూ.2 వేల నోట్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు పాత రూ.500 - రూ.1000 నోట్ల క‌న్నా చాలా స‌రికొత్త‌గా ఉన్నాయి. ఇక ఈ నోట్లు పాత నోట్ల కంటే త‌క్కువ పొడ‌వు - వెడ‌ల్పుతో పాటు చాలా తేలిక‌గా ఉండ‌డంతో ఈ నోట్ల నాణ్య‌త విష‌యంలో చాలా మందికి ర‌క‌ర‌కాల సందేహాలు ఉన్నాయి.

నీళ్ల‌ల్లో త‌డిస్తే ఈ కొత్త రూ.2000 నోట్ల రంగు మారిపోతుంద‌ని... ముద్ద‌గా చేస్తే మ‌ళ్లీ ఈ నోట్లు ప‌నికిరావ‌ని ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. పాత రూ.500 - రూ.1000 నోట్ల‌తో పోలిస్తే ఈ కొత్త రూ.2 వేల నోట్లు ఎంత వ‌ర‌కు నాణ్య‌త‌తో ఉంటాయ‌ని ఎవ‌రికి తోచిన‌ట్టు వారు లెక్క‌లు వేసుకుంటున్నారు.

అయితే ఈ అనుమానాల‌కు ఈ వీడియో షాకింగ్ ఆన్స‌ర్ ఇవ్వ‌డం ఖాయం. ఈ వీడియోలో కొత్త రూ.2 వేల నోటును ఓ వ్య‌క్తి ఇష్టానుసారం న‌లిపేశాడు. నోటు ఈ చివ‌ర నుంచి ఆ చివ‌ర వ‌ర‌కు న‌లిపి త‌ర్వాత ఆ న‌లిపిన నోటును నీళ్ల‌లో త‌డిపేశాడు. నీళ్ల‌ల్లో నానాక కూడా మ‌ళ్లీ దానిని ఉండ‌గా చుట్టి న‌లిపాడు. త‌డి ఆరిపోయాక చూస్తే ఆ నోటు మామూలుగానే త‌ళ‌త‌ళ‌లాడుతోంది.

దాదాపు 30 నిమిషాల పాటు నీళ్ల‌లో వేసి రూ.2 వేల నోటుపై చేసిన ఈ ప్ర‌యోగం వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూశాక రూ.2 వేల నోటు నాణ్య‌త‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న అనుమానాల‌న్ని ప‌టాపంచ‌లు కావ‌డం ఖాయం. చాలా స‌రికొత్త టెక్నాల‌జీని ఈ నోటు త‌యారీకి వాడిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఆల‌స్య‌మెందుకు ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News