రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 5 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అంతరాష్ట్ర నీటి వివాదం పై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ , రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొంటారు.
ఈ భేటీలో ముఖ్యంగా పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ అభ్యంతరాలు..కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీ వాదనలపై ఇందులో చర్చ జరిగే అవకాశం ఉంది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్ సమావేశం జరగ్గా ఇది రెండోసారి. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జల్ శక్తి నాలుగు అంశాలతో అజెండా రూపొందించింది. 1.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 2. అపెక్స్ కౌన్సిల్ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లను అందజేయడం, 3. కృష్ణా, గోదావరి నదీ జలాలను ఇరు రాష్ర్టాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 4. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించడం. ఇందులో డీపీఆర్ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది.ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది.