మేము దేవుళ్లం కాదు..మనుషులం : ప్రధాని మోడీ!

Update: 2021-04-06 12:34 GMT
బెంగాల్ లో ఈసారి మమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ ప్రజలు తమ గుర్తింపును, భవిష్యత్ ను కాపాడుకునేందుకు ఇంకొంత కాలం ఎదురుచూడాలని అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో మాత్రమే పాల్గొనడం లేదు. బంగాల్ పునరుజ్జీవానికి బాటలు పరుస్తున్నారని మోడీ అన్నారు. ఈ సందర్భంగా మమతపై విమర్శలు ఎక్కుపెట్టారు మోడీ. కొన్నిసార్లు దీదీ తనని టూరిస్ట్ అని, కొన్నిసార్లు బయటివ్యక్తి అని పిలుస్తోందని,కానీ చొరబాటుదారులను సొంతవారిగా పరిగణించి, భరతమాత పుత్రులను బయటి వ్యక్తులని మమత పిలుస్తోందని మోడీ విమర్శించారు. ప్రజలని  అవమానించడం మమత ఆపాలన్నారు. దేశ పౌరులపై బయటివారు అనే ముద్ర వేసి రాజ్యాంగాన్ని అవమానించొద్దని మమతకి హితవు పలికారు.

బెంగాల్ ప్రజల నుండి దీదీ మేనల్లుడి కప్పం వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. క్యూబ్ బీహార్ లో ప్రచారం చేసిన మోడీ మమతా పై విమర్శలు కురిపించారు. దీదీ నంది గ్రామ్ లో కోపం ప్రదర్శించినప్పుడే ఆమె ఓడిపోతారని దేశం గ్రహించింది అని అన్నారు. మీరేమైనా దేవుడా అని నన్ను ప్రశ్నిస్తున్నారు. మేము ప్రజలకి సేవ చేసుకునే సాధరణ మనుషులమే ,ప్రజలు బొట్టు పెట్టుకోవడం , కషాయ వస్త్రాలు ధరించడం దీదీ సహించలేకపోయారు అంటూ మోడీ విమర్శించారు.
Tags:    

Similar News