ఏపీ , తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతుంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని తెలంగాణ సర్కార్ ఆరోపణలు చేస్తుంటే, కాదు అదంతా అబద్దం..మేము కట్టే ప్రాజెక్ట్స్ కొత్తవి కావు, గతంలో ఉన్నవే. తెలంగాణ ప్రభుత్వమే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుందని జగన్ సర్కార్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలనీ కోరుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం పంపారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ నుండి స్పందన లేదంటూ ఈ నెల 7న తమకు రాసిన లేఖ సరికాదని , అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండా పాయింట్లతో నాలుగవ తేదీన లేఖ కూడా పంపామని చెప్పిన సీఎం తెలిపారు.
కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కావు అని , కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ఈ ప్రాజెక్టులు ఉన్నాయని , 2015లో కేఆర్ ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది. కృష్ణానదీ నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు. నీటి నిల్వ సామర్థ్యం పెరగదు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతలు చేపట్టాం. రాయలసీమ ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టు కాదని మనవి చేస్తున్నా అని ముఖ్యమంత్రి జగన్ లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్రం తరఫున మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మొదట అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ రాష్ట్రం చెప్పిందని, కానీ తర్వాత దాన్ని అతిక్రమించి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిందని , ఈ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో తాము పిటిషన్లు కూడా దాఖలు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థ, ఆయకట్టును సృష్టిస్తున్నాయి ,నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని భావించాం. ఆ సమావేశం జరగకుండా ఆగిపోయింది అని జగన్ తన లేఖ లో పొందుపరిచారు.