ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి వారి మధ్యవర్తిత్వం.. స్వయంగా అంబానీ రంగంలోకి దిగి, జగన్ ఇంటికి వెళ్లి మరీ చెప్పారు.. ఇదంత పరమల్ నత్వానీ రాజ్యసభ సీటు విషయంలో అనే ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విన్నపాలను మోడీ, అమిత్ షాల ముందు పెట్టారు. వాటిని పరిశీలించిన వారు మరో ఎదురు రిక్వెస్ట్ ను చేశారని వార్తలు వచ్చాయి. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే నాలుగింట ఒకటిని తమకు కేటాయించాని బీజేపీ పెద్దలు జగన్ ను కోరినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఎలాగూ 4 రాజ్యసభ సీట్లు దక్కనుండటంతో ఒకదాన్ని త్యాగంచ ఏయడానికి జగన్ పెద్దగా ఆలోచించకపోవచ్చు. అడిగింది మోడీ, షా కావడంతో.. ఆయన కూడా ఓకే చెప్పి ఉండవచ్చు. అనేది ఒక సహజమైన అభిప్రాయం.
ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ వెళ్లి వైఎస్ జగన్ తో సమావేశం కావడంతో కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త ఊహాగానాలు రైజ్ అయ్యాయి. బీజేపీ అడిగిన రాజ్యసభ సీటు అభ్యర్థి మరెవరో కాదు.. పరిమల్ నత్వానీ అనే ముకేష్ అంబానీ సన్నిహితుడు అనే ప్రచారం మొదలైంది. ఆయన కూడా జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. తాము జగన్ ను రాజ్యసభ సభ్యత్వం విషయంలోనే రిక్వెస్ట్ చేసినట్టుగా నత్వానీ ధ్రువీకరించారు. అప్పుడు జగన్ ఏ విషయాన్నీ చెప్పేయలేదు అనేది అసలైన కథ. ఆలోచించుకుని చెబుతామని అంబానీ, నత్వానీలకు సమాధానం ఇచ్చారట జగన్.
ఇక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నిన్నటి నుంచినే నామినేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 13 వరకూ నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నత్వానీకి జగన్ సీటు కేటాయిస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది.
నత్వానీ వెనుక ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి వారి రిక్వెస్ట్, అంబానీ విన్నపాలున్నాయి. ఈ నేపథ్యంలో.. జగన్ వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తారా లేదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాఖలు అయ్యే నామినేషన్లను బట్టి స్పష్టం కానుంది!