చంద్రబాబు తల కిందుల తపస్సు చేసినా కుదరదట!

Update: 2019-11-13 14:25 GMT
చంద్రబాబు తల కిందుల తపస్సు చేసినా కుదరదట!
తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని వ్యాఖ్యానిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి  సునీల్ దేవదార్ వంటి వారు అదే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ను ఇక నమ్మేది ఉండదని ఆయన చెప్పారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన ప్రయత్నాలు తను కొనసాగిస్తున్నట్టు గా తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ ను కలిసి వచ్చారు. ఆ పై చిన్నజీయర్ స్వామీజీ వద్ద కు కూడా వెళ్లి వచ్చారు. వాళ్ల కాళ్ల మీద పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. తద్వారా భారతీయ జనతా పార్టీ కి దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నట్టుగా  సమాచారం.

ఇలాంటి క్రమంలో ఏపీ భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తి దాయకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ తో బీజేపీ పొత్తు ఉండదని విష్ణు తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు తలకిందుల తపస్సు చేసినా భారతీయ జనతా పార్టీ ఇక ఆయనను పట్టించుకోదని విష్ణువర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం నైతికత లేని పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. మొత్తానికి బీజేపీ నేతలు చంద్రబాబు కు ఝలక్  ఇచ్చే ప్రకటనలే చేస్తూ వస్తున్నట్టున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News