బీజేపీలే చేరితే నీ ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తాం.. చేరిక వేళ స్టార్ హీరోకు బెదిరింపులు
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బీజేపీ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఈరోజు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర పార్టీ నేతల సమక్షంలో కిచ్చా సుదీప్, దర్శన్ తూగుదీప పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సుదీప్, బీజేపీ ధ్రువీకరించాయి. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు ఓట్లు, సీట్ల కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాయి. ఈయన వాల్మీకి నాయక సామాజికవర్గానికి చెందిన హీరో. ఈ సామాజికవర్గం కర్ణాటకలో 7శాతం ఉంది. గత ఎన్నికల్లో వీరు బీజేపీకి మద్దతుగా ఓటేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా ఇదే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇవాళ బీజేపీలో చేరనున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఆయనకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు పబ్లిక్ చేస్తామని అసభ్య పదాలతో కూడిన వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీని పై సుదీప్ మేనేజర్ జాక్ మంజు ఫిర్యాదు చేశారు.
బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ బెదిరింపు లేఖలు ఎవరు పంపారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సుదీప్ తోపాటు మరో హీరో దర్శన్ కూడా బీజేపీ లో చేరుతున్నారు. వీరిద్దరికీ మాస్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది అభిమానులు ఉన్నారు. ఇరువురి చేరికతో బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడుతాయని బీజేపీ భావిస్తోంది.
కర్ణాటకలో బలమైన నాయక సామాజికవర్గానికి చెందిన సుదీప్ వయసు 51 ఏళ్లు. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజికవర్గం కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. దీనివల్ల ఆ వర్గం ఓటు బ్యాంకుతోపాటు సుదీప్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది.
సుదీప్ తెలుగులోనూ నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో ఆయన టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాహుబలి, సైరాలలోనూ చిన్నపాత్రలు పోషించారు. కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.