పెళ్లి...ప్రతి ఒక్కరి జీవితం లో ఎంతో ముఖ్యమైన వేడుక. జీవితంలో ఒకేఒకసారి జరిగే అతి పెద్ద వేడుకనే పెళ్లి. పెళ్లితో ఇద్దరి మనసులు , రెండు కుటుంబాలు ఏకం అవుతాయి. మన దేశంలో వివాహ వేడుకలకు, కుటుంబాలు, ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వెడ్డింగ్ కార్డుల, ఎంపిక దగ్గరి నుంచి రిసెప్షన్ పూర్తయ్యే వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటాలని భావిస్తుంటారు వధూవరులు.
కొంతమంది రొటీన్ కు భిన్నంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులలో తమ సంస్కృతి, భాష, యాస వంటివి కనిపించాలని భావిస్తారు. మరికొందరు మాత్రం తాము ఎంచుకున్న, స్థిరపడిన రంగాన్ని ప్రతిబింబించే మాటలు, పదాలతో పెళ్లి కార్డును రూపొందిస్తుంటారు. తాజాగా ఇలాంటి క్రియేటివ్ వెడ్డింగ్ కార్డ్ ల జాబితా లో చేరారు అసోంలోని గౌహతి కి చెందిన ఒక న్యాయవాది. అడ్వకేట్ అయిన అజయ్ శర్మ.
అసోంలోని గౌహతికి చెందిన అడ్వకేట్ అజయ్ శర్మ, హరిద్వార్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న పూజా శర్మ ఆదివారం పెళ్లిపీటలెక్కుతారు. అయితే, తన పెళ్లి కోసం వరుడు అజయ్ తన న్యాయవాద వృత్తి ని ప్రతిబింబించేలా వెడ్డింగ్ కార్డు ను రాయించారు. రాజ్యాంగం లోని చట్టాలను పొందుపరుస్తూ రూపొందించిన ఈ వివాహ ఆహ్వాన పత్రిక ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పెళ్లి కార్డులో వధూవరుల సమానత్వాన్ని సూచించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. న్యాయ దేవత చేతిలో ఉండే త్రాసులో ఇరువైపులా వధూవరుల పేర్లను ప్రింట్ చేశారు. ఈ స్పెషల్ వెడ్డింగ్ కార్డులో భారతీయ వివాహాలను నియంత్రించే చట్టాలు, హక్కులను కూడా ప్రస్తావించారు. పెళ్లి చేసుకునే హక్కు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు లభించే జీవించే హక్కులో ఒక భాగం. ఈ ప్రాథమిక హక్కును ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
2021 నవంబర్ 28న ఆదివారం నాడు నేను ఈ హక్కును ఉపయోగించుకుంటున్నాను అని అజయ్ రాయించారు. లాయర్లు పెళ్లి చేసుకున్నప్పుడు అన్నింటికీ అవును అని చెప్పరు. ఇందుకు బదులుగా నిబంధనలు, షరతులను అంగీకరిస్తాం అని చెబుతారు అనే వాక్యం సైతం అడ్వకేట్ వృత్తిని గుర్తుకు తెస్తుంది. ఐదేళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్న అజయ్, పెళ్లి కార్డు గురించి తన సహోద్యోగులతో చర్చిస్తూ అనుకోకుండా ఇలాంటి ప్రత్యేకమైన కార్డును తయారు చేయాలనుకున్నాడు.
తన వృత్తికి హాస్యాన్ని జత చేసి, వెడ్డింగ్ కార్డును తయారు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. సాధారణంగా వెడ్డింగ్ కార్డ్ ని చూసేటప్పుడు ఎవరైనా వేదిక, సమయం, తేదీ ని మాత్రమే చెక్ చేస్తారు. డెకరేషన్ కోసం పైన, రాసిన వాటిని చదవరు. అయితే ఇలాంటి వాటిపై అందరి దృష్టి పడాలని నేను భావించాను.
ఈ స్పెషల్ వెడ్డింగ్ కార్డు డిజైన్, టెక్స్ట్ కోసం అజయ్ తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు. ఆ తరువాత దాన్ని తన సహోద్యోగులకు పంపించాడు. అనంతరం ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పెళ్లి పత్రిక వైరల్ అయిన తర్వాతే దీని గురించి అజయ్ కుటుంబానికి తెలిసిందట. కార్డు చదివిన వారు దాని గురించి చర్చించేందుకు అజయ్ తండ్రికి ఫోన్ చేయడంతో ఆయనకు విషయం తెలిసిందట.
కార్డులో మొదటి ఫోన్ నంబర్ మా నాన్నది. ఈ కార్డు చదివిన బంధుమిత్రులు ఆయన నంబర్ కు ఫోన్ చేశారు. దీంతో దాని గురించి అన్ని వివరాలు నన్ను అడిగారు. వాస్తవానికి నేను రెండు వెడ్డింగ్ కార్డులు తయారు చేశాను. బంధువులకు పంపినది సాంప్రదాయ పెళ్లి పత్రిక. మరొకటి నా మిత్రులు, సహోద్యోగులైన లాయర్లను ఆహ్వానించడానికి ప్రింట్ చేయించాను అని అజయ్ చెప్పారు.