విశాఖ లో గంజాయి ఆయిల్.. బానిసవుతున్న యువత

Update: 2020-12-16 13:30 GMT
డ్రగ్స్ పై పోలీసుల నజర్ పెరగడంతో ప్రకృతి సిద్దంగా దొరికే గంజాయి వైపు యువత, కేటుగాళ్లు చూపు పడింది. నిషాను అందించే గంజాయి నుంచి తీసిన ‘హషీస్’ అనే ఆయిల్ తో ఇప్పుడు యువత మత్తులో మునిగితేలుతున్నారు. హషీస్ అనే నిషా ఎక్కించే ఆయిల్ ను సిగరేట్ లో ఒక్క చుక్క వేసి పీలిస్తే చాలు 24 గంటల పాటు మత్తులో తూలాల్సిందే. చాలా మంది యువత ఇప్పుడు దీనికి బానిస అవుతున్నారు.

హషీస్ నిషా ఆయిల్ ఇప్పుడు విశాఖపట్నంలో యువతను చిత్తు చేస్తోంది. వాట్సాప్ లో ఆర్డర్ తీసుకొని మరీ హోం డెలివరీ చేస్తున్నారు. ఈ ఆయిల్ కోసం యువత ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు.

ఇప్పుడీ నిషా ఆయిల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. ఆయిల్ రవాణాపై రాచకొండ పోలీసులు నిఘా పెట్టారు.

*హషీస్ ఆయిల్ తయారీ ఇలా..
రహస్యంగా మన్యంలో.. అడవుల్లో గిరిజనులు పండించే గంజాయిని బాగా మరగబెట్టిన తర్వాత ప్రొపైల్ అల్కహాల్ రసాయనాన్ని కలిపి హషీస్ ఆయిల్ ను తయారు చేస్తారు.  ఈ కొత్త రకం ఆయిల్ ను తాజాగా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు లక్ష్మీపతి బయటపెట్టాడు. తేనె రంగులో ఉండడంతో దీన్ని ఎవరూ సరిగ్గా గుర్తించలేరు. సరఫరాకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవని  సరఫరాదారులు విశాఖలో ఈ ఆయిల్ ను తయారు చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.

ఈ హషీస్ ఆయిల్ ను సిగరెట్ , పొగాకులో ఒక చుక్క కలిపి సేవిస్తారు. 24 గంటల పాటు మత్తులో ఇది జోగేలా నిషాను ఇస్తుంది. 10 ఎంఎల్ కు రూ.3వేలకు ఈ ఆయిల్ ను విక్రయిస్తారట.. డిమాండ్ ను బట్టి రూ.5వేల వరకు ఉంటుంది.
Tags:    

Similar News