వీకెండ్ టూర్... లంబసింగిలో భారీ ట్రాఫిక్ జాం

Update: 2021-12-12 13:38 GMT
ఉరుకుల ప‌రుగుల జీవితం ఇప్పుడు అంద‌రికీ సాధార‌ణ‌మై పోయింది. ఒక‌ప్పుడు.. హైప్రొఫైల్ ఉద్య‌గుల‌కు మాత్ర‌మే ఇలాంటి హ‌డావుడి జీవితాలు ఉండేవ‌ని అనేవారు. కానీ, ఇప్పుడు సామాజికంగా వచ్చిన మార్పులు.. మార్కెట్ పోటీ.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. జీవ‌న వ్య‌యం పెరిగిపోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ.. రెండు మూడు ఆదాయ మార్గాల‌ను వెతుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో స‌హ‌జంగానే ఒత్తిడి, అల‌స‌ట కామ‌న్ అయింది. మ‌రి దీని నుంచి రిలీఫ్ ఏంటి? ఒత్తిడిని ఎలా ఎదుర్కొనాలి.. అంటే.. వీకెండ్‌ను ఎంజాయ్ చేయ‌డ‌మే! చ‌లో టూర్‌.. అని బ్యాగులు స‌ర్దేయ‌డ‌మే!

ఇప్పుడు.. ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు ఇలా వ‌చ్చేవారితో మ‌ళ్లీ క‌ళ వ‌చ్చింది. సుమారు రెండు సంవ‌త్స‌రాలుగా.. ప‌ర్య‌ట‌కం బోసి పోయింద‌నే చెప్పాలి. క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్‌.. త‌ర్వాత సెకండ్ వేవ్‌.. ఆంక్ష‌లు.. భ‌యా లు.. ఇలా.. అనేక అంశాలు ప‌ర్యాట‌క రంగంపై ప్ర‌భావం చూపించాయి. దీంతో ప‌ర్యాట‌క ప్రేమికులు ఇంటికే ప‌ర‌మిత‌మ‌య్యారు. అయితే.. ఇప్పుడిప్పుడే.. క‌రోనాత‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. ఒమిక్రాన్ భ‌యం ఉంద‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ప్రాణాంత‌కం కాద‌నే స‌మ‌చారం వ‌స్తుండ‌డంతో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో సంద‌డి క‌నిపిస్తోంది.

ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఏపీలో విశాఖ‌కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక్క‌డ అనేక ప్రాంతాలు ప‌ర్యాట కు ల‌ను మంత్ర ముగ్దుల‌ను చేస్తున్నాయి. ఇటీవ‌ల రైల్వే శాఖ కూడా విస్టా డోమ్ కోచ్‌ల‌ను ఏర్పాటు చేసి.. అర‌కు పర్యాట‌కానికి మ‌రిన్ని సొబ‌గులు అద్దింది. దీంతో ప‌ర్యాట‌కులు ఇప్పుడు విశాఖ‌కు క్యూక‌డుతున్నా రు. తాజాగా వ‌రుస సెల‌వులు వ‌చ్చాయి. శ‌నివారం ఆదివారం.. సెల‌వులు కావ‌డంతో విశాఖ మొత్తం ప‌ర్యా ట‌కుల‌తో నిండిపోయింది. అరకు,లంబసింగి, పాడేరులో ప‌ర్యాట‌కులు సందడి చేస్తున్నారు. వనజంగి మేఘాల కొండపై ప‌ర్యాట‌కుల వాహ‌నాలు పెరిగిపోయి.. ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో కిలోమీటర్ దూరం మేర వాహ‌నాలు నిలిచిపోయాయి.

సుమారు రెండేళ్ల‌ త‌ర్వాత‌.. ఇలా టూరిజంతో విశాఖ క‌ళ‌క‌ళ‌లాడ‌డం.. ప‌ర్యాట‌కుల రాక‌తో.. స్థానిక వ్యాపారా లు కూడా పుంజుకోవ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, ప‌ర్యాట‌కుల రాక నేప‌థ్యంలో అధికారులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మాస్కులు ధ‌రించ‌డాన్ని కంప‌ల్స‌రీ చేశారు. అదేవిధంగా.. శానిటేష‌న్‌కు కూడా ప్రాధాన్యం క‌ల్పించారు.
Tags:    

Similar News