ఏపీ రాజ‌కీయాల్లో సంక్షేమం యుద్ధం...!

Update: 2022-05-21 03:30 GMT
ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ఈ ప‌రిణామం.. ఎవ‌రూ ఊహించ‌నిది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇటు ప్ర‌తిప‌క్షం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. ప్ర‌భుత్వం పాల‌న స‌రిగా చేయ‌డం లేద‌ని.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. టీడీపీ విమ‌ర్శించింది. దీనికి వైసీపీకౌంట‌ర్లు ఇవ్వ‌డం.. కీల‌క‌మైన మంత్రులు నోరు చేసుకోవ‌డం తెలిసిందే. అయితే.. ఇప్పుడు హ‌ఠాత్తుగా.. ఈ రాజ‌కీయం యూట‌ర్న్ తీసుకుంది. అదే.. సంక్షేమం దిశ‌గా!! ఔను. ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమంపై చ‌ర్చ సాగుతోంది.

బ‌హుశ, రాష్ట్ర చ‌రిత్ర‌లో ఈ రేంజ్‌లో ప్ర‌జ‌ల సంక్షేమంపై చ‌ర్చ జ‌రుగుతున్న ప‌రిస్థితి గ‌తంలో క‌నిపించ లేదు. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం రాజ‌కీయాలు చేసుకున్నాయే త‌ప్ప‌.. సంక్షేమంపై చ‌ర్చ జ‌రిగిన దాఖ‌లా ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం.. మంత్రుల‌ను రంగంలోకి దింపుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులే దీనికి నేతృత్వం వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బీసీల‌కు తాము ఏం చేశామో.. ప్ర‌తిప‌క్షం టీడీపీ అదికారంలో ఉన్న‌ప్పుడు ఏం చేసిందో వివ‌రించ‌నున్నారు.

అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు కూడా.. తాము ఏం చేశామో.. టీడీపీ ఏం చేసిందో వైసీపీ నేత‌లు.. మంత్రులు వివ‌రించ‌నున్నారు. ఇక‌, టీడీపీ కూడా.. త్వ‌రలోనే బీసీ మ‌హా గ‌ర్జ‌న పేరుతో ఇంటింటికీ తిరుగుతుంద‌ని.. మాజీ ఎమ్మెల్సీ.. ఆపార్టీ నాయ‌కుడు.. బుద్ధా వెంక‌న్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంటే.. మొత్తంగా ఇటు అధికార పార్టీ, అటు ప్ర‌తిప‌క్షం కూడా.. బీసీల‌కు తాము ఏం చేసిందీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీ ఏం చేయ‌లేదు.. అనే విష‌యాల‌ను తెర‌మీదికి తెచ్చారు.

ఇది రాజ‌కీయంగా కంటే కూడా.. ఆయా సామాజిక వ‌ర్గాల ప‌రంగా చూస్తే.. మంచి ప‌రిణామ‌మనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వం ఎవ‌రికి ఏం చేసింద‌నేది.. ప్ర‌జ‌ల‌కు తెలియాలి. అదేస‌మ‌యం లో ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క విష‌యం.. ఇంకా చేయాల్సింది ఏంట‌నే. కేవ‌లం ఇవి రాజ‌కీయ యాత్ర‌లు కాకుండా.. బీసీల‌కు కానీ, ఎస్సీ, ఎస్టీల‌కు  కానీ.. భ‌విష్య‌త్తులో ఇంకా చేయాల్సింది ఏంట‌నే విష‌యం.. రెండు పార్టీలూ.. చ‌ర్చ‌కు పెట్టాల‌ని.. మేధావులు సూచిస్తున్నారు. అప్పుడు నిజంగానే ఆయా వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News