ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో పోలింగ్ లో హింస చెలరేగింది. పోలింగ్ స్టేషన్ పరిధి లో పార్టీల పేరు చెప్పి వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు ఘర్షణల కు పాల్పడ్డార ని తెలుస్తుంది. ఈ సందర్భంగా సుమారు 15మంది మృతిచెందినట్లు ప్రాధమిక సమాచారం!
అవును... పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రచ్చ రచ్చగా మారాయి. ఇందు లో భాగంగా పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్విటర్ ఖాతా లో వెల్లడించింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీల పై తీవ్ర స్థాయి లో విరుచుకుపడింది. ముఖ్యంగా భాజపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్ ఆరోపించింది.
ఇదే సమయం లో టీఎంసీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల కు చెందిన మరికొంతమంది మృతిచెందినట్లు చెబుతున్నారు. ఇదే సమయం లో రేజినగర్, తుపాన్ గంజ్, ఖర్ గ్రామ్ ప్రాంతాల్లో మరో ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా… దోమ్ కోల్ లో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయని తెలుస్తుంది.
ఇందు లో భాగంగా తాజాగా కొంతమంది వ్యక్తులు రాళ్లు విసరడంతోపాటు కాల్పుల కు తెగబడటంతో పలు పోలింగ్ స్టేషన్ లు యుద్ద ప్రాంతాన్ని తలపించాయని చెబుతున్నారు. ఫలితంగా శనివారం సాయంత్రానికి మృతుల సంఖ్య 15 చేరిందని కథనాలొస్తున్నాయి.
ముఖ్యంగా నార్త్ 24 పరగణాస్ లోని స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్ ఒకరు హత్యకు గురవ్వడంతో పాటు.. కూచ్ బెహార్ లో బీజేపీ అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కూడా మృతి చెందినవారి లో ఉన్నారని సమాచారం. పోలింగ్ జరుగుతున్న పాఠశాలల లోకి దుండగులు దూరి మరీ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఇదే సమయం లో కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లను పూర్తిగా ధ్వంసం చేశారని సమాచారం.
మరోపక్క ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారని తెలుస్తుంది. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేయడంతోపాటు దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారని అంటున్నారు.
కాగా... పశ్చిమ బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాల్లో శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 22 జిల్లా పరిషత్ లు.. 9,730 పంచాయతీ సమితులు.. 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయం లో సుమారు 5.67 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు!!